మీటర్లపై కేసీఆర్ వాఖ్యలు పచ్చి అబద్దాలు

మీటర్లపై కేసీఆర్ వాఖ్యలు పచ్చి అబద్దాలు

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్రం బలవంతం చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపణలను  కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వ్యవసాయ మోటార్ల మీటర్లపై కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలేనని కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ మాటలను ఖండిస్తూ మంత్రి ఓ ప్రకటనను విడుదల చేస్తూ  కేసీఆర్ కేంద్రంపై బురద జల్లేందకే ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

 ఈ మేరకు  ‘అపోహలు-వాస్తవాలు’ పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఏ రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని కేంద్రం స్పష్టం చేసింది. సౌర విద్యుత్ కొనుగోలు చేయాలంటూ రాష్ట్రాలను ఒత్తిడి చేయడంలేదని వివరించింది. ఓపెన్ బిడ్ ల ద్వారానే కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు పునరుత్పాద ఇంధనం కోసం ఒపెన్ బిడ్లు నిర్వహిస్తోంది. ఈ బిడ్‌లతో అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. తక్కువ టారీఫ్‌ను అందించే కంపెనీలు ఓపెన్ బిడ్ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేస్తారు.  అ బిడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనుకునే రాష్ట్రాలు తమ అవసరకానికి అనుగునంగా వ్యవహరిస్తాయని స్పష్టం చేశారు. 

విద్యుత్ మీటర్లు, విద్యుత్ కొనుగోళ్ల అంశం రాష్ట్రాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. పునరుత్పాదక విద్యుత్ కొనాలని తాము ఎక్కడా చెప్పలేదని, కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది.

అసలు, ఫలానా వారి నుంచే విద్యుత్ కొనాలని చెప్పలేదని, ఏ రాష్ట్రం ఎవరినుంచైనా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రం విమర్శించింది. పైగా, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రూ.55 వేల కోట్లు అప్పుగా ఇచ్చాయని, కేసీఆర్ అందుకు రుణపడి ఉండాలని హితవు పలికింది.

. విద్యుత్ సంస్కరణలపై కేంద్రం ముసాయిదా బిల్లు తెచ్చిందని ఇటీవల సిఎం కేసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు.వ్యవసాయ రంగానికి కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడనేది కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉందని ఆరోపించారు. వంద శాతం మీటర్ రీడింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలని తెలిపారు.