భారత్ బీజింగ్  వింటర్ ఒలింపిక్స్ దౌత్య బహిష్కరణ 

బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కానీ, ముగింపు వేడుకలకు కానీ భారత్ తరఫున రాయబారి హాజరుకాబోరని  విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ అరిందమ్ బాగ్చి  చెప్పారు.
 
 2022 వింటర్ ఒలింపిక్స్ కు గాల్వాన్ సైనికుడిని టార్చ్ బేరర్‌గా చైనా తయారు చేస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్స్ ను రాజకీయం చేయడానికి చైనా ఎంచుకోవడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు. 
 
  గత ఏడాది జూన్లో గాల్వాన్ లోయలో భారత బలగాలపై దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు క్విఫాబావోని ఇండియన్ సోల్జర్స్ పట్టుకున్నారని ఓ వార్తా సంస్థ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం..  గత ఏడాది జూన్ 15-16 తేదీల  మధ్య చీకట్లో గాల్వాన్ నదిని దాటడానికి 38 మంది చైనా సైనికులు ప్రయత్నించారు. 
 
అప్పుడు భారత,  చైనా దళాల మధ్య ముఖాముఖిగా పోరాటం జరిగింది. కాగా, భారత బలగాలపై దాడికి పాల్పడ్డ చైనా దళానికి క్వి ఫాబావో నాయకత్వం వహించాడు. ఈ సందర్భంగా జరిగిన పోరాటంలో గాల్వాన్ వ్యాలీలో మోహరించిన భారత బలగాల్లో స్నో లెపార్డ్ అయిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఈ ఆపరేషన్ లో మరణించిన విషయం తెలిసిందే.   
 
అరుణాచల్ అబ్బాయిపై హింస
 
కాగా, చైనా సైన్యం అపహరించిన అరుణాచల్ ప్రదేశ్ అబ్బాయిపై హింసను ప్రయోగించిన విషయాన్నీ చైనా దృష్టికి తీసుకొచ్చిన్నట్లు అరిందమ్ బాగ్చీ తెలిపారు. 

“జనవరి 18న అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న లుంగ్తా జోర్ ప్రాంతం నుంచి మిరం తరోన్ (17)ను చైనా సైన్యం అపహరించుకుపోయింది. అప్పుడతడు తన మిత్రుడు జానీ యాయింగ్‌తో కలిసి వేటాడుతున్నాడు. అయితే జానీ యాయింగ్ ఎలాగోలా చైనా సైనికులకు చిక్కకుండా తప్పించుకుని భారత అధికారులకు వివరాలు తెలిపాడు” అని వివరించారు.

కాగా చైనా సైన్యం జనవరి 27న అంజ్వా జిల్లా లోని కిబిథులో ఉన్న వాచాదామై ఇంటరాక్షన్ పాయింట్ వద్ద మిరంను భారత సైన్యానికి అప్పగించింది. తన కుమారుడిని నిర్బంధంలో చైనా సైనికులు కళ్లకు గంతలు కట్టి, తన్నారని, అంతేకాక కరెంటు షాక్ కూడా ఇచ్చారని మిరం తరోన్ తండ్రి ఒపాంగ్ తరోన్ తెలిపారు.