బిజెపి మద్దతును అడ్డుకోలేని ఫిరాయింపులు!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులను చవిచూస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి మద్దతు లభిస్తుందని,   ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

 ఉత్తరప్రదేశ్‌లో రాజీనామాలు పెద్ద విషయం కాదని, రాష్ట్రంలో బీజేపీకి అన్ని చోట్ల నుంచి మద్దతు లభిస్తోందని, ప్రజలు ఆశీర్వదించారని స్పష్టం చేశారు.  యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధిస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

బిజెపి నిండు ఫిరాయిస్తున్న వారు సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నారు.  కీలకమైన ఒబిసి నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య యుపి మంత్రివర్గం నుండి రాజీనామా చేయడంతో ఈ ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి. మొత్తం ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్యెల్యేలు బిజెపికి రాజీనామా చేసి ఎస్పీలో చేరారు.

 
ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మౌర్య కుమారుడు అశోక్‌కు ఉంచహార్‌ నుంచి టికెట్‌ ఇస్తానని ఎస్పీ హామీ ఇచ్చినట్లు సమాచారం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం వెనుకబడిన తరగతులు,   దళితులను నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా ఆరోపణలు చేటున్నారు.  
అయితే, యూపీలో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు పెద్ద విషయం కాదని, రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి బీజేపీకి మంచి మద్దతు లభిస్తోందని తోమర్‌ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను మరోసారి ఆశీర్వదిస్తారని చెప్పుకొచ్చారు.
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ఆయన చెప్పుకొచ్చారు. కీలక నేతలు రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీ ఓడిపోతుందనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని వివరించారు. అన్ని రంగాల్లో యూపీ ఎంతో ప్రగతి సాధించిందని చెబుతూ ప్రతీ వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని తెలిపారు.
కీలక నేతలు రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీ ఓడిపోతుందనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని వివరించారు. అన్ని రంగాల్లో యూపీ ఎంతో ప్రగతి సాధించిందని,  ప్రతీ వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పుకొచ్చారు.