మల్లిఖార్జున ఖర్గేకు కరోనా

రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో ఆయనకు పాజిటివ్ గా కన్ఫామ్ అయింది. ఖర్గేకు ఎటువంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ ఉన్నారని.. ఆయన కార్యాలయం తెలిపింది. ఖర్గే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా.. కరోనా సోకిందన్నారు.

మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీకి కూడా కరోనా వచ్చింది. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొన్నారు ఇద్దరు నాయకులు. మరోవైపు అసోం, నాగాలాండ్ గవర్నర్ జగదీశ్ ముఖి కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో గవర్నర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

ప్రపంచ మాజీ ఛాంపియన్ భారత బ్యాడ్మిటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ సహ ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కరోనా సోకింది. ఒకేసారి ఏడుగురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఇండియా ఓపెన్ టోర్నీలో కలకలం రేపింది. వీరందరూ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నారని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఒక ప్రకటనలో వెల్లడించింది. 

కిదాంబి శ్రీకాంత్ తోపాటు అశ్వని పొన్నప్ప, రితికా రాహుల్ థక్కర్, సిమ్రన్ అమాన్ సింఘీ, మిథున్ మంజునాథ్,కుషి గుప్తా, ట్రెస్సా జోలి తదితరులు కరోనా బారిన పడి ఐసొలేషన్ లో ఉన్నారని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షల 50వేలకు చేరువలో నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,47,417 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 380 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 4,85,035కు చేరింది. 

ఇక కరోనా  నుంచి 24 గంటల్లో84,825 కరోనా పేషంట్లు రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 11,17,531  కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 13.11% శాతంగా ఉంది. ఇక భారత్ లో ఒమిక్రాన్ కేసులు 5,488గా ఉన్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. పలు నగరాల్లో రాత్రి పూట  కర్ఫ్యూ విధించారు.