ప్రధాని భద్రతా లోపం కాంగ్రెస్ లో ఎవ్వరికీ అవసరం?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం వల్ల కాంగ్రెస్‌లో ఎవరు లాభపడాలనుకున్నారో వెల్లడించాలని  కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రికి భద్రత కల్పించడం ప్రోటోకాల్ అని, కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఈ ప్రోటోకాల్‌ను, భద్రతా చర్యలను ఉద్దేశపూర్వకంగా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ, ఎందుకు ఉల్లంఘించిందని ఆమె  నిలదీశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
 సుప్రీంకోర్టు ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపంపై దర్యాప్తు కోసం  జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి భద్రతకు బెదిరింపులను పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు పదే పదే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియజేయాలని ఆమె నిలదీశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆమె స్పష్టం చేశారు.  ఇదిలావుండగా, ఓ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ఇటీవల ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు ముందే రైతుల నిరసన గురించి పంజాబ్ పోలీసులకు తెలుసునని తన దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది. స్మృతి ఇరానీ ఈ విషయాన్ని విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. 
 
ప్రధానమంత్రి భద్రతను ఉల్లంఘించి, ఆయనకు హాని కలిగించేలా రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారని, అటువంటి   వారికి సౌకర్యాలు కల్పించారని ఆమె ఆరోపించారు. పంజాబ్‌లో శాంతి భద్రతలు దెబ్బతినడం వల్ల డిజిపి, పోలీసులు పిఎంఓకు  భద్రతా మద్దతును అందించడంలో పంజాబ్ ప్రభుత్వ అసమర్ధత వెల్లడైనట్లు స్మ్రితి ఇరానీ ధ్వజమెత్తారు.

“పంజాబ్‌లోని పరిపాలన పరిస్థితి అలాంటిది, పరిపాలనాపరంగా ఒక దేశ అధిపతి పట్ల అనుసరించాల్సిన ప్రోటోకాల్, భద్రతా వివరాల పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. తద్వారా ప్రధాని మోదీకి  హాని కలిగించవచ్చు” అని ఇరానీ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి ప్రయాణించే మార్గంలో ప్రధాని భద్రతకు సంబంధించి పూర్తి స్పష్టత ఇవ్వాలని పంజాబ్ డిజిపి తీసుకున్న నిర్ణయంపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ప్రధాని వెళ్లే మార్గం గురించి నిరసనకారులకు ఎలా తెలిసిందని ఆమె ప్రశ్నించారు.

“పంజాబ్ ప్రభుత్వంలో ఫ్లైఓవర్ పైన మొక్కలు నాటిన వ్యక్తులకు ప్రధానమంత్రి మార్గం గురించి సమాచారం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు బహిరంగంగా అందుబాటులో ఉన్న వీడియో సాక్ష్యం, అలాంటి ప్రశ్నలను తెరపైకి తెస్తుంది, ”అని ఆమె చెప్పారు.

ఇది ప్రధాని మోదీకి హాని కలిగించే కుట్ర అని పేర్కొన్న ఇరానీ, “చాలా మంది వ్యక్తులు అక్కడికి చేరుకోవడం కేవలం యాదృచ్చికం కాదు. ఇది ఒక కుట్ర. లోపానికి బాధ్యులెవరు? పంజాబ్ పోలీసులు మూగ ప్రేక్షకుడిగా ఉండిపోయారు. ఎలాంటి భద్రతా ప్రోటోకాల్ పాటించలేదు” అంటూ ఆమె మండిపడ్డారు.

ప్రధానమంత్రికి భద్రత కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రత ఏదీ చేసినా స్పందించలేదని ఆమె ఆరోపించారు. . బదులుగా, ప్రధాని భద్రతా వివరాలు ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నాయకులు సంతోషంగా,   ఆనందంగా ఉన్నారని ఇరానీ విస్మయం వ్యక్తం చేశారు.

“ప్రధాని మోదీకి భద్రత కరువైనప్పుడు, ఆయన జోష్ ఎలా ఉందని కాంగ్రెస్ నేతలు సంతోషంతో ఉలిక్కిపడ్డారు! ప్రధాని మోదీ  ఎప్పటిలాగే, తిరిగి వస్తుండగా, ‘జిందా లౌత్ రహా హూన్ (నేను సజీవంగా తిరిగి వస్తున్నాను) అని చెప్పారు, ”అని బిజెపి ఆమె గుర్తు చేశారు.

పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రంధావా భారీ భద్రతా లోపాన్ని అంగీకరించిన తర్వాత స్మృతి ఇరానీ ఇటువంటి తీవ్రమైన ప్రకటన చేయడం గమనార్హం.  ప్రత్యామ్నాయ మార్గాన్ని ముందుగానే ప్లాన్ చేయాలి, కానీ అది జరగలేదని రంధావా పేర్కొన్నారు.

ఇలా ఉండగా, ప్రధాన మంత్రి భద్రతకు జరిగిన లోపం గురించి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎందుకు వివరించారో చెప్పాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  పంజాబ్ ముఖ్యమంత్రి తనకు ఈ విషయం గురించి చెప్పారని ప్రియాంక గాంధీ ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారని ఆమె గుర్తు చేశారు.
భద్రతకు సంబంధించిన వివరాలు కేవలం భద్రతా సంస్థలకు మాత్రమే పరిమితం కావలసి ఉండగా, ప్రధాన మంత్రి భద్రతా నిబంధనలు, వాటి ఉల్లంఘన గురించి ముఖ్యమంత్రి చన్నీ ఓ పౌరురాలు (ప్రియాంక గాంధీ వాద్రా)కు చెప్పడానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. న్నారు.
పీఎం భద్రతా లోపంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించడంపై స్పందించేందుకు స్మృతి ఇరానీ నిరాకరించారు. ఈ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత బీజేపీ తనను స్పందించాలని ఆదేశిస్తే తాను స్పందిస్తానని ఆమె చెప్పారు.