కేంద్ర ప్రభుత్వం చేతికి వొడాఫోన్‌ ఐడియా

దేశంలో మూడో అతిపెద్ద ఫోన్‌ అపరేటర్‌గా ఉన్న వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్‌ వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు ఇవాళ(మంగళవారం) అధికారికంగా ప్రకటించింది. 
 
దీంతో వొడాఫోన్‌- ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. గత కొద్దికాలంగా.. వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లను భారీగా కోల్పోవడం, లాభదాయక పరిస్థితులు కనిపించకపోవడంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపినట్లు కంపెనీ తెలిపింది. 
 
లండన్‌కు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ 28.5 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌ 17.8 శాతం వాటాలను కలిగి ఉందని చెప్పింది. లేటెస్టుగా  కంపెనీ తీసుకున్న నిర్ణయంతో.. భారత ప్రభుత్వం 36 శాతం వాటానాను కలిగి ఉండడంతో కీలక పాత్ర పోషించే అవకాశముంది. 
 
టెలికాం సంస్థ యొక్క రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, రుణభారంతో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చినట్లయితే, దాదాపు రూ. 1.95 లక్షల కోట్ల అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారులలో ఒకటిగా మారుతుంది.

ప్రభుత్వం టెలికాం ఆపరేటర్‌లకు వాయిదా వేసిన స్పెక్ట్రమ్ వాయిదాలపై 4 సంవత్సరాల వాయిదా కోసం వడ్డీని,   అటువంటి వడ్డీ మొత్తాన్ని పేరుకుపోయిన రుణాలను ఈక్విటీగా మార్చడం ద్వారా బకాయిలను చెల్లించే అవకాశాన్ని ఇచ్చింది. సంబంధిత తేదీ ఆగస్టు 14, 2021 నాటి కంపెనీ షేర్ల సగటు ధర సమాన విలువ కంటే తక్కువగా ఉన్నందున, ఈక్విటీ షేర్లు  తుది నిర్ధారణకు లోబడి ఒక్కో షేరుకు సమాన విలువ రూ.10 చొప్పున ప్రభుత్వానికి జారీ చేయబడతాయని ఆ కంపెనీ  తెలిపింది. .