అమరావతి కార్పోరేషన్ ఏర్పాటుపై గ్రామసభల్లో వ్యతిరేకత 

రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలతో పాటు మంగళగిరి మండలంలోని మరో మూడు గ్రామాలను కలిపి అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎసిసిఎంసి) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు గ్రామసభల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో అధికారులు సోమవారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామసభల్లో గ్రామస్తులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రభుత్వం తొలుత ఏదైతే  చెప్పిందో దాని ప్రకారం అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు  డిమాండ్‌ చేశారు.
 
ప్రభుత్వం మూడేళ్లుగా రాజధానిలో ఎలాంటి అభివఅద్ధి చేయలేదని, ఇప్పుడు కార్పొరేషన్‌ పేరుతో మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. విభజించు పాలించు అన్న చందంగా ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో రాజధానిని ముక్కలు చేయాలని చూస్తోందని అనంతవరం గ్రామసభలో రైతు రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాజధాని స్మార్ట్‌ సిటీని అన్ని పంచాయతీలతో చేయాల్సి ఉండగా ప్రభు త్వం దురుద్దేశంతో ఏసీసీఎంసీ(అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పోరేషన్‌) అని 19 గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయడానికి చూస్తోందని, అమరావతిని నిర్వీర్యం చేయటంలో భాగమేనని చెప్పారు.
 
రాజధానిలో 19 గ్రామాలతో కార్పొరేషన్‌ ఏర్పాటుపై ఆయా గ్రామసభల్లో గ్రామస్తులు చేతులెత్తి తమ వ్యతిరేకతను తెలిపారు. 29 గ్రామాలతో కార్పొరేషన్‌ ఏర్పాటుకు అనుకూలంగా పంచాయతీలో తీర్మానం నమోదు చేయించి సంతకాలు చేశారు. ration o