మహిళల ప్రపంచ కప్‌ భారత్ కెప్టెన్ గా మిథాలీరాజ్‌

ఐసిసి మహిళల ప్రపంచ కప్‌ 2022 పోటీలకు భారత జట్టు ఎంపికైంది.  ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) గురువారం ప్రకటించింది. 

ఈ ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వైస్‌ కెప్టెనుగా వ్యవహరించనున్నారు. ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ న్యూజిలాండ్‌ టూర్‌, షో పీస్‌ ఈవెంట్‌ కోసం జట్లను ఎంపిక చేసిందని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

 ప్రపంచకప్‌కు వెళ్లే జట్టు ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా ఆడనుంది.ఈ టోర్నీలో నాకౌట్‌కు ముందు భారత్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

 మిథాలీ రాజ్‌ 2017లో జరిగిన మునుపటి మహిళల ప్రపంచ కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. సెమీ-ఫైనల్‌లో పవర్‌హౌస్‌ ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత భారత్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయింది. 

మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్-కీపర్), రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్స్: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్.

న్యూజిలాండ్‌లో ఏకైక టీ20కి భారత జట్టు 

హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్-కీపర్)., రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్.

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్  

మార్చి 6వ తేదీన టౌరంగలోని బే ఓవల్ మైదానంలో భారత ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. మార్చి 10వతేదీన  హామిల్టన్ సెడాన్ పార్క్ లో న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది. మార్చి 12వతేదీన హామిల్టన్ సెడాన్ పార్క్ వెస్ట్ ఇండీస్ జట్టుతో భారత్ జట్టు ఆడనుంది.

మార్చి 16వతేదీన టౌరంగలోని బే ఓవల్ లో ఇంగ్లండు జట్టుతో, మార్చి 19వతేదీన ఆస్ట్రేలియాతో ఆక్లాండ్ ఈడెన్ పార్క్ లో, మార్చి 22వతేదీన బంగ్లాదేశ్ జట్టుతో హామిల్టన్ సెడాన్ పార్క్ లో, మార్చి 27వతేదీ దక్షిణ ఆఫ్రికా క్రైస్ట్‌చర్చ్ లో హాగ్లీ ఓవల్ గ్రౌండులో భారత మహిళల జట్టు తలపడనుంది.