
రాజ్ భవన్ బయట ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. ప్రజలు రాతపూర్వకంగా తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఫిర్యాదులు చేయొచ్చని ఆమె చెప్పారు.
‘‘ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఆర్థిక సాయం వంటి సమస్యలపై నా వంతు సాయం అందజేస్తాను” అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసినందుకు ఆమె తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య శాఖను అభినందించారు.
అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తన సందేశమని చెబుతూ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరి సహకారంతో కరోనా మాదిరి ఈ మహ మ్మారిని కూడా ఎదుర్కోగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ల్యాప్ ట్యాప్ లు,సెల్ ఫోన్లు, కంప్యూటర్లు లేక ఆన్ లైన్ చదువులకు దూరమవుతున్నామని ఎంతో మంది పేద విద్యార్థుల సమస్యను తన దృష్టికి తెచ్చారని గవర్నర్ చెబుతూ, దీంతో పలు ఎన్జీవోలను, ఐటీ సంస్థలను ల్యాప్ ట్యాప్ లు ఇవ్వాలని కోరగా స్పందించాయని ఆమె తెలిపారు.
మొత్తం 2 వేల మందికి ల్యాప్ ట్యాప్ లు కావాలని రాజ్ భవన్ కు వినతులు రాగా, ఇటీవల 20 మందికి, శనివారం మరో 20 మందికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ల్యాప్ ట్యాప్ లను గవర్నర్ అందజేశారు. వారిలో 7 గురు దివ్యాంగులు, 13 మంది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థు లు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అందరూ భౌతికదూరంతో పాటు మాస్క్‌ను ధరించాలని సూచించారు. ఇ క, ఒమిక్రాన్ రాకుండా ఉండాలంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలని చెప్పారు.
2019లో తమిళిసై రాష్ట్ర గవర్నర్గా నియమితులైనప్పటి నుండి రాజ్ భవన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వరికీ అందుబాటులో లేకపోవడం, మంత్రులు సహితం సచివాలయంలో లభించక పోతూ ఉండడంతో ప్రతిపక్షాల నేతలు, ప్రజా సంఘాలు రాజ్ భవన్ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు తీసుకునేందుకు ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిర్యాదులు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More Stories
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి
బీసీ కులగణన కాంగ్రెస్ కుట్ర
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం