మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులకు కరోనా

మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి కేసుల సంఖ్య పెరుగుతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై  కరోనా ఎఫెక్ట్ పడింది. డిసెంబరు 22న ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులు కరోనా బారిన పడ్డారు. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో సుమారు 50 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు.

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్‌, మరో మంత్రి కెసి పాడ్వి, బీజేపీ  ఎమ్మెల్యే సమీర్‌ మేఘేలకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు వైరస్‌ సోకిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వర్ష గైక్వాడ్‌ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. 

ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే సోమవారం వరకు ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు అసెంబ్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. 

రెండు వేలకు చేరువలో కేసులు 

కాగా, ముంబ‌యిలో ఆసుప‌త్రి మౌలిక స‌దుపాయాలు పెంచి, మందులు, ఆక్సిజ‌న్ ని ఏర్పాటు చేయాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తుంది. పెద్ద‌లు, పిల‌ల్ల‌కు టీకాలు వేయ‌డంపై ప్ర‌త్యేక దృష్టిని పెట్టింది. అధికారుల‌తో సమావేశమైన  మ‌హారాష్ట్ర మంత్రి ఆదిత్య‌ఠాక్రే. క‌రోనా కేసులు నిన్న 70శాతం ఉండ‌గా, నేడు 2వేల‌కి చేర‌నున్నాయ‌ని పేర్కొన్నారు.

15నుండి 18ఏళ్ళ వ‌య‌సు వారికి టీకాని జ‌న‌వ‌రిలో ఇవ్వ‌నున్న‌ట్టు ట్వీట్ చేశారు. రాబోయే 48 గంటల్లో, 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారందరికీ టీకా డ్రైవ్‌ను నిర్వహించేందుకు నగరంలోని అన్ని విద్యాసంస్థలతో కనెక్ట్ అవుతుంద‌ని మంత్రి మరో ట్వీట్‌లో తెలిపారు. జంబో కోవిడ్ కేర్ సెంటర్‌లు “మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రాథమిక సౌకర్యాలతో పాటు అన్ని సంసిద్ధత స్థాయిలలో” స్టాండ్‌బైలో ఉండాలని చెప్పారు.

న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై మాట్లాడుతూ అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు. ముంబైలో నిన్న 24గంట‌ల వ్వ‌వ‌ధిలో 1,377 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.నగరంలో స్పైక్ రేటు చాలా ఎక్కువగా ఉంది, డిసెంబర్ 8 నుండి మూడు వారాల్లో కేసులు 188 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.

మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తాజా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది “ఆందోళనకరమైన పరిస్థితి” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడం, ముంబైలో పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్ల సంఖ్య నేటు 2,200 దాటవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌జ‌లంతా మాస్క్ లు ధ‌రించాల‌ని కోరారు.