భార్య, కుమార్తె ముందే బిజెపి నేతను దారుణంగా నరికి చంపారు!

ఆదివారం ఉదయం, కేరళ బిజెపి నాయకుడు రంజిత్ శ్రీనివాస్ తల్లి వినోదిని పూజ కోసం స్థానిక ఆలయానికి వెళ్ళింది. శ్రీనివాస్ కొచ్చిలో జరుగునో ఓబిసి మోర్చా రాష్ట్ర కమిటీ మొదటి సమావేశంకు హాజరు కావడానికి బయలుదేరే పనిలో ఉన్నాడు. మొదటిసారి రాష్ట్ర స్థాయి పార్టీ విభాగంలో కార్యదర్శి హోదాలో సమావేశంకు వెళ్లబోతుండడంతో ఆ కుటుంభం సంతోషంతో ఉంది. 
 
అయితే ముందు రోజు రాత్రి తమ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్.షన్ హత్యకు ప్రతీకారంగా అన్నట్లు ఎస్‌డిపిఐ కార్యకర్తలు ఆదివారం రంజిత్‌ను హత్య చేశారు. అంతకు ముందే తన పెద్ద కూతురు భాగ్యను ట్యూషన్‌ క్లాసుల వద్ద వదిలిపెట్టి రంజిత్ ఇంటికి తిరిగి వచ్చాడు. 
 
అప్పటి వరకు ఆ కుటుంభంలో ఎటువంటి అసాధారణమైన పరిస్థితి లేదని, అసలు భయపడే కారణం కూడా లేదని  కుటుంబానికి సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రంజిత్ ఏ క్రిమినల్ కేసులో లేడు. కేవలం తమ రాష్ట్ర స్థాయి నాయకుడు హత్యకు గురికావడంతో, ఎవ్వరో ఒక బిజెపి రాష్ట్ర స్థాయి నాయకుడిని చంపాలనే ప్రతీకారంతో ఎస్‌డిపిఐ దుండగులు ఈ దారుణంకు పాల్పడ్డారు.

అలప్పుజాలో బిజెపికి చురుకైన నేతగా ఎదుగుతున్న రంజిత్ ను ఈ మధ్యనే బిజెపి రాష్ట్ర ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా చేశారు. ఆ కమిటీ మొదటి సమావేశంతో ఆ రోజు తన రాజకీయ జీవితంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నారు.
అభిజిత్ తన సోదరుడిని తలపై సుత్తితో కొట్టారని, బుద్ధి లేకుండా నరికి చంపారని, ఇంటిని కూడా ధ్వంసం చంపారని అతని సోదరుడు, ఐటి ప్రొఫెషనల్ అభిజిత్  చెప్పారు.  రంజిత్‌ను నరికి చంపి, అతని తల్లి, భార్య, చిన్న కుమార్తె సమక్షంలోనే అనేక గాయాలతో అతని ముఖాన్ని అమానుషంగా వికృతీకరించారని తెలిపాడు.

భాగ్య ట్యూషన్ క్లాసుల్లో ఉండగా, 4వ తరగతి చదువుతున్న రంజిత్ చిన్న కూతురు హృద్య తన కళ్లెదుట జరుగుతున్న ఈ దారుణాన్ని చూసి దిగ్బ్రాంతికి గురయింది. “ఆమె డ్రాయింగ్ రూమ్‌కి పరుగెత్తుకుంటూ వచ్చినప్పుడు, ఆ ముఠా ఆమెపై కత్తితో దాడి చేసింది. దాడిలో మా అమ్మ పడిపోతే, ముఠా ఆమె ముఖానికి కుర్చీని నొక్కింది, ”అని అభిజిత్ వివరించాడు.మత్స్యకారుల కులం ధీవర నుండి నాయకుడిగా ఎదిగిన రంజిత్ న్యాయవాది. అతని భార్య లిషా కూడా అలప్పుజలో న్యాయవాది.
సోమవారం సాయంత్రం జిల్లాలోని ఆరట్టుపుజాలోని కుటుంబీకుల ఇంటి ఆవరణలో బీజేపీ కార్యకర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

ఇలా ఉండగా, కేరళలో గత రెండు నెలల్లో పిఎఫ్ఐ,  ఎస్‌డిపిఐ ల ప్రమేయంతో జరిగిన మూడో హత్య ఇది కావడం గమనార్హం. పిఎఫ్‌ఐ ద్వారా శిక్షణ, ఆయుధాల సేకరణను తనిఖీ చేయడంలో రాష్ట్ర పోలీసులు విఫలం అవుతూ ఉండడంతో వారి హింసకు అడ్డు ఉండడం లేదు. రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించే వ్యూహంలో భాగంగా ఇవి జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
అంతకు ముందు రాత్రి అలప్పుజా జిల్లాలో  జరిగిన ఎస్‌డిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ షాన్ హత్యకు ప్రతీకారంగా రంజిత్ హత్య జరిగిన్నట్లు నిర్ధారణకు వచ్చిన  పోలీసులు, ఇద్దరు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు.
అయితే షాన్ మన్నన్చేరి అలప్పుజాకు చెందినవాడు. మన్నంచెరి, అప్పూర్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా సీపీఎం, ఎస్‌డీపీఐ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటున్నది. ఈ వాస్తవాన్ని ఎస్‌డిపిఐ నేతలే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో షాన్ హత్య వెనుక సీపీఎం పాత్రను తోసిపుచ్చలేము. కానీ పోలీసులు ఆ దృష్టిలో దర్యాప్తు చేయడం లేదు.
పైగా,  మన్నంచెరి ప్రాంతంలో బీజేపీ, ఎస్‌డీపీఐ మధ్య ఎలాంటి ఉద్రిక్తలు లేవు. మన్నంచేరి, అప్పూర్‌లు బిజెపికి కాకుండా ఎస్‌డీపీఐ, సిపిఎం లకు బలమైన పట్టుగల ప్రాంతాలు.
అయితే  షాన్ హత్య జరిగిన వెంటనే పిఎఫ్ఐ, ఎస్‌డీపీఐలు ఈ హత్య వెనుక ఆర్ ఎస్ ఎస్ ఉన్నదని ఆరోపిస్తూ, ప్రతీకారంగా రంజిత్ హత్యకు పాల్పడటం విస్మయం కలిగిస్తుంది. వాస్తవానికి ప్రతీకారం తీర్చుకుంటాం అని అర్ధరాత్రి వారి ఊరేగింపు జరిపినప్పుడు కూడా పోలీసులు అప్రమత్తం కాలేదు.
fe