భైంసా అల్లర్ల ఘటనలో పోలీసుల వేధింపులు

భైంసా అల్లర్ల ఘటనలో పలువురు హిందూ వాహిని కార్యకర్తలను తెలంగాణ పోలీసులు వేధిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు.  ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఆయన వివరాలను అందించారు. 

నలుగురు వ్యక్తులపై పీడీ చట్టాన్ని ప్రయోగించి మార్చి 14 నుంచి చంచల్‌గూడ జైలులో నిర్బంధించారని వివరించారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ వారి నివాసానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేటు పాఠశాల భవనంలో వాళ్లు ఉంటున్నారని.. దాంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. 

ఈ వ్యవహారాన్ని పరిశీలించి కార్యకర్తల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, తెలంగాణలో వరి తరుగు పేరుతో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోచుకుంటుంటే టీఆర్‌ఎ్‌సకు చెందిన ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడడం లేదని, సినిమా  నటులతో  పోలుస్తూ కేటీఆర్‌  డైలాగులు మాట్లాడుతున్నారని అరవింద్ ధ్వజమెత్తారు.