ఇంటర్నెట్ లేకుండానే త్వరలో డిజిటల్ చెల్లింపులు 

ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం త్వరలో రాబోతోంది. ఈ వివరాలను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
 
ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్లలోనే ఈ సౌలభ్యం ఉండగా.. రాబోయే రోజుల్లో సాధారణ ఫోన్లలోనూ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యుపిఐ) ఆధారిత సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 
అభివృద్ధి, నియంత్రణ విధానాలపై ప్రకటనలో ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. యూపీఐ చెల్లింపులకు జనాదరణ పెరిగేలాచేయడంతో పాటు  జనాదరణ పెరిగేలా చేయాలనే లక్ష్యంతో లక్ష్యంతో ఫీచర్ ఫోన్ల ద్వారా  ఈ లావాదేవీలకు అవకాశం కల్పిస్తారు. 

ఆర్బీఐ రిటెయిల్ డైరెక్ట్ స్కీమ్, అదేవిధంగా ఐపీఓ ఆఫరింగ్ అప్లికేషన్లకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతారు. ఈ స్కీమ్ ద్వారా వ్యక్తులు ఆర్బీఐ వద్ద గిల్ట్ సెక్యూరిటీస్ అకౌంట్‌ను తెరచి, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. 

వాలెట్లు, కార్డులు, యూపీఐ ద్వారా చెల్లింపుల విధానంలో వసూలు చేసే ఛార్జీలపై డిస్కషన్ పేపర్‌ను విడుదల చేయనున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. 

కాగా,  దేశంలో సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సిబిడిసి)ని అందుబాటులోకి తెస్తే ప్రధానంగా సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మోసాలు ప్రధాన సవాళ్లుగా నిలువనున్నాయని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. సిబిడిటిల్లో హోల్‌సేట్‌, రిటైల్‌ లాంటి రెండు రకాలు ఉన్నాయని డిప్యూటీ గవర్నర్‌ టి శంకర్‌ తెలిపారు. 

వీటిపై చాలా కసరత్తు జరుగుతుందని చెబుతూ దీనిపై పూర్తిగా స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తి అయినా దానిపై పైలెట్‌ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. వర్చూవల్‌ కరెన్సీ అనుమతి సాధ్యాసాధ్యాల పాలసీపై ఆర్‌బిఐ చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తుందని దాస్‌ తెలిపారు. వర్చూవల్‌ కరెన్సీ చుట్టు అనేక భద్రత రిస్కులు ఉన్నాయని శంకర్‌ తెలిపారు.