జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దన్న సీబీఐ 

అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ హైకోర్టు ను కోరింది. సాక్ష్యాలను జగన్ తారుమారు చేసే అవకాశముందని సీబీఐ వాదించింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దశంతోనే గతంలో హాజరు మినహాయింపునకు హైకోర్టు నిరాకరించిందని సీబీఐ గుర్తు చేసింది. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టు జరిపిన విచారణలో  జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. పదేళ్లైనా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని సీబీఐ తెలిపింది. 

హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని సీబీఐ పేర్కొంది. ఈ పిటిషన్ పై సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి పదేళ్లయినా కేసులు ఇంకా డిశ్చార్జ్‌ పిటిషన్ల దశలోనే ఉన్నాయని కోర్టుకు వివరించింది.

 కేసును ఆలస్యం చేయడానికి జగన్‌ ఆడుతు న్న గేమ్‌ప్లాన్‌లో భాగంగానే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని పేర్కొంది. క్విడ్‌ ప్రొ కో కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయిం పు ఇవ్వాలని కోరుతూ ఈ కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించింది.

ఇప్పు డు ఇంకా ఎక్కువగా సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని సిబిఐ న్యాయవాది తెలిపారు. వ్యక్తిగత మినహాయింపుపై ఇప్పటికే తీర్పు ఇచ్చినందున మళ్లీ దానిని సమీక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. వివిధ కారణాలతో హాజరు నుంచి మినహాయింపు అడిగిన ప్రతిసారీ దిగువ కోర్టు మంజూరు చేసిందని గుర్తు చేశారు.

ఒక్కసారి అభియోగాలు నమోదు చేయడం పూర్తయి తే ఒక ఏడాది లోపు ట్రయల్‌ పూర్తి కావలసి ఉంటుందని తెలిపారు. కేసులు నమోదై పదేళ్లు అవుతోందని.. ఇప్పటికు చా లా ఆలస్యం జరిగిందని వివరించారు. హాజరు మినహాయింపు ఇస్తే విచారణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది. సిబిఐ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సిబిఐ కోర్టులో జగన్‌ హాజరు మినహాయింపు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.