మహారాష్ట్రలో అవినీతి, అవకాశవాద, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం

మహారాష్ట్రలో రెండేళ్లుగా అధికారంలో ఉన్న శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి  (ఎంవిఎ) ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా “అత్యంత అవినీతి, అవకాశవాద, ప్రజా వ్యతిరేక, పనికిరాని” ప్రభుత్వమని బిజెపి మండిపడింది. ఉద్ధవ్ ఠాక్రే “అనుకోని, విధులకు హాజరు కాని” ముఖ్యమంత్రిగా మిగిలారని అభివర్ణించింది. 

సీనియర్ బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఎన్‌సిపి, శివసేన నాయకులపై చెలరేగిన వివిధ అవినీతి కేసులను జాబితా ప్రస్తావిస్తూ ఎంవిఎ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో రాజకీయాలను నేరపూరితం చేసిందని ఆరోపించారు.  ఈ రెండేళ్ల పాలనలో ప్రశంసింప వలసిన పనేమీ చేయలేదని ధ్వజమెత్తారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు శివసేన-బిజెపి కూటమికి తమ ఆదేశాన్ని ఇచ్చారని, అయితే శివసేన అధినేత ప్రత్యర్థి ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో చేతులు కలిపారని థాకరీపై విరుచుకుపడ్డారు. 

“ప్రజలు దీనిని ‘మహా వసూలియా అఘాడీ సకార్’ (దోపిడీ చేసే ప్రభుత్వం) అని పిలుస్తారు. నేను దీనికి ‘మహా విశ్వస్ఘటి అఘాడి సర్కార్’ (విశ్వాసం లేని ప్రభుత్వం) అని కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాను” అని బిజెపి నాయకుడు ఎద్దేవా చేశారు.