
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సిద్ధమవుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తో లోతైన సంభాషణలో ఉన్న చిత్రాలను పంచుకున్నారు. “నూతన భారతదేశం” కోసం వారి దృష్టిని సూచించే ఒక పద్యంతో పాటు చిత్రాలను ఆయన ట్వీట్ చేశారు.
బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 6,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో ప్రారంభించి ప్రారంభించి శుక్రవారం నుండి ప్రధాని మూడు రోజుల ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని ఉన్నారు. లక్నో లోని రాజ్ భవన్ లో బస చేశారు. శని, ఆదివారాలలో డీజీపీల సదస్సులో ప్రధాని పాల్గొన్నారు.
రాజ్ భవన్ కారిడార్‌లో నడుస్తున్నప్పుడు ప్రధాని మోదీ చేయి సీఎం ఆదిత్యనాథ్ భుజంపై ఈ ఫోటోలలో ఉంది. ఆదివారం ఉదయం ప్రధానిని కలిసేందుకు వెళ్లి, గంభీర అంశాలపై సమాలోచనలు జరిపిన్నట్లు ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వారిద్దరూ ఏ అంశాలపై చర్చించుకున్నారో మాత్రం బటయకు తెలియదు. రాబోయే ఎన్నికల గురించే కావచ్చని భావిస్తున్నారు.
2022 ప్రారంభంలో యూపీలో జరుగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్టీకి చెందిన ఇద్దరు స్టార్ క్యాంపెయినర్లు ఏకాంతంగా, గంభీరంగా చర్చలలో మునిగిపోవడం సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఎంత త్వరగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రచారానికి బీజేపీ సిద్ధమవుతున్న తరుణంలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి ప్రచారంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నారు.
గత వారం రాష్ట్రంలో ఎన్నికల నగరాలను మోగిస్తున్నట్లుగా, సిఎం ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రధాని మోదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ గతంలో “మాఫియా, పేదరికం కేంద్రంగా” ఉండేదని, అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఇటీవల రాష్ట్రం సాధించిన అభివృద్ధికి నిదర్శనమని పేర్కొంటూ ఆదిత్యనాథ్ పరిపాలనను కొనియాడారు.
ఇలా ఉండగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు ఓడిపోయిన 78 స్థానాలను తిరిగి కైవసం చేసుకోవడంపై బీజేపీ ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఎం ఆదిత్యనాథ్ ఈ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కొత్త ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు.
బిజెపి వర్గాల సమాచారం ప్రకారం, ఆదిత్యనాథ్ ఇప్పటివరకు 19 నియోజకవర్గాల్లో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రాజెక్టులను ప్రారంభించారు. బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే రోజుల్లో మిగిలిన స్థానాలను సందర్శించనున్నారు.
“2022లో వీటిల్లో కనీసం 55 స్థానాలు గెలవడమే లక్ష్యం. సిఎంతో పాటు, డిప్యూటీ సిఎంలు ఇద్దరూ కూడా అలాంటి నియోజకవర్గాల్లో త్వరలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు” అని బిజెపి నాయకుడు ఒకరు చెప్పారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
సావర్కర్ పై రాహుల్ వాఖ్యలపట్ల ఉద్ధవ్ ఆగ్రహం!