కేంద్ర విశ్వవిద్యాసంస్థలలో అడ్మిషన్లకై ఇస్లామిస్ట్ ల పన్నాగం

కేరళలోని మలప్పురం మునిసిపాలిటీ కనీసం 1000 మంది విద్యార్థులకు కేంద్ర/జాతీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందేవిధంగా సహాయం చేసేందుకు ఒక ప్రయత్నం ప్రారంభించిన్నట్లు జమాత్ ఇస్లామీయ హింద్ నడిపే వార్తాపత్రిక  మాధ్యమం వెల్లడించింది.  ఆ విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమం పేరు “మిషన్ 1000”.  ఈ వార్త కధనం ప్రకారం ఈ సంవత్సరం ఈ ప్రయత్నాల  కారణంగా దాదాపు 40 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు.

ఈ విద్యార్థులు మునిసిపాలిటీ ఎక్సలెన్స్ సేకరణ,  మార్గదర్శక కార్యక్రమంలో భాగంగా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన 40 మంది విద్యార్థులలో ఎక్కువ మంది మునిసిపల్ ప్రాంతానికి చెందినవారు కాగా, కొంతమంది సమీపంలోని ఉప పంచాయతీల నుండి వచ్చారు. ఇంకా, మున్సిపాలిటీ విద్యార్థులకు అవసరమైన అన్ని సమాచారాన్ని అందించడానికి, విద్యార్థులతో ఫాలోఅప్ చేయడానికి క్లస్టర్ అప్రోచ్‌ను రూపొందించిందని నివేదిక తెలిపింది.

మలప్పురం మున్సిపాలిటీలో  ముస్లిం లీగ్ అధికార పార్టీగా ఉంది.  మునిసిపాలిటీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఔత్సాహిక , పేద విద్యార్థులకు సహాయం చేయడంగా చిత్రీకరించి, ప్రచారం చేశారు. ప్రత్యేకించి విద్యాసంస్థల్లోకి చొచ్చుకుపోయే ఇస్లామిక్ ఎజెండా నేపథ్యంలో ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశ్యం అమాయకంగా కనిపించడం లేదు.

తమఇస్లామిస్ట్ ఎజెండాను అమలు  చేయడం కోసం అధికారిక యంత్రాంగాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకొంటున్నట్లు స్పష్టం అవుతున్నది. భారతదేశంలో ఏ స్థానిక సంస్థ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహింక పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జిల్లా, మునిసిపాలిటీలోని జనాభా దామాషాను కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంది.

జెఐఎచ్, పిఎఫ్ఐ, ముజాహిద్‌లు వంటి కేరళలోని ఇస్లామిస్ట్ సంస్థలు  సెంట్రల్ యూనివర్శిటీలు,  ఐఐటి లు,  మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌లు, నేషనల్ లా స్కూల్స్,  టిస్ వంటి భారతదేశంలోని ప్రముఖ సంస్థలలో తమ కమ్యూనిటీ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసం విద్యార్థులకు సహాయం చేయడానికి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లు, ప్రీ-అడ్మిషన్ సపోర్ట్ సిస్టమ్ లను సమకూరుస్తున్నాయి . 

ముస్లిం ఉపాధ్యాయులు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు వంటి వారు ఈ కార్యక్రమంలో క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. ముస్లిం ఉపాధ్యాయులు,  విద్యార్థి నాయకులు ఔత్సాహిక విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. వారు ముస్లిం యువకులకు కేంద్ర సంస్థలు, కేంద్ర ప్రభుత్వంలో విద్య,  ఉపాధి గురించి సమాచారాన్ని అందించడానికి  వాట్సాప్   సమూహాలను కూడా ఉపయోగిస్తున్నారు.

ఈ వాట్సాప్ గ్రూపులు తమ నెట్‌వర్క్‌ల ద్వారా పొందిన ముఖ్యమైన సమాచారాన్ని మెరుపు వేగంతో వ్యాప్తి చేస్తున్నాయి. ఇంకా, ఇస్లామిస్ట్ గ్రూపులు తమ కమ్యూనిటీ విద్యార్థుల విద్యకు ఆర్థికంగా మద్దతునిచ్చే యంత్రాంగాన్ని కూడా సృష్టించాయి. ఈ ప్రయత్నాల కారణంగా అనేక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వ్యవస్థపై దాని దీర్ఘకాల ప్రభావంతో పాటు, ఈ వ్యవస్థీకృత ప్రయత్నాలు కొన్ని తక్షణ ప్రభావాలను కూడా చూపుతున్నాయి. ఢిల్లీ వంటి కీలక నగరాలు, ముఖ్యమైన సంస్థలు శాంతిభద్రతల సమస్యలకు కారణం కావడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. అటువంటి పరిణామాలను నియంత్రించడం శాంతిభద్రతల విభాగాలకు జటిలంగా మారుతున్నది.

ఈ సందర్భంగా వారు చట్టం నుండి తప్పించుకోవడం కోసం `బాధితులు’, `మానవకోణం’ లను ప్రయోగిస్తున్నారు. రాబోయే రోజులలో ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే అవకాశం కూడా తోసిపుచ్చలేం. సిఎఎ  వ్యతిరేక ఆందోళనల సమయంలో ముస్లిం విద్యార్థులు ఢిల్లీలో కమ్యూనిస్ట్ అంచుల మద్దతుతో చాలా ఇబ్బందులు సృష్టించారు.

ఢిల్లీలో ఇబ్బందులు సృష్టించిన వారిలో చాలా మంది కేరళకు చెందిన వారు కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం త్రిపురలో ముస్లింలపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఢిల్లీలో ఎంఎస్ఎఫ్ బ్యానర్‌ కింద ముస్లిం విద్యార్థులు నిరసన చేపట్టారు.  ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కేరళకు చెందిన వారు కావడం కాకతాళీయం కాదని చెప్పవచ్చు.