కరోనా ముందున్న రేట్లకు రైల్వే టిక్కెట్లు

 కరోనా-లాక్‌డౌన్‌ తర్వాత ‘స్పెషల్‌’ పేరిట రైళ్లు నడుపుతూ పెంచిన టికెట్‌ రేట్లను రైల్వేలు తిరిగి పాత ధరలకే సవరించాయి. కరోనాకు ముందు ఉన్న టికెట్‌ రేట్లను తక్షణం అమలులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది భారత రైల్వే శాఖ. అంతేకాదు కొవిడ్‌ స్పెషల్‌ ట్యాగులను సైతం రైళ్లకు తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ వర్తింపు ఉంటుందని తెలిపింది. అయితే పండుగ పూట నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లకు మాత్రం ఈ సవరణ వర్తించదని స్పష్టం చేసింది. అంతేకాదు పూర్థిస్తాయిలో రైళ్లను నడిపించేందుకు (గతంలో నడిచే 1700 రైళ్లు) సైతం రైల్వే శాఖ సిద్ధమైంది.  కరోనా ప్రభావంతో రైల్వే వ్యవస్థ కొన్ని నెలలపాటు బంద్‌కాగా,  భారత రైల్వే శాఖ ఆదాయం దారుణంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే.
 
అయితే లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కొన్ని రైళ్లను(ఆల్రెడీ ఉన్న సర్వీసులనే) స్పెషల్‌ ట్రెయిన్స్‌ పేరుతో దాదాపు అన్ని రూట్లలో నడుపుతూ.. అన్ని కేటగిరీల సిట్టింగ్‌లను..  ‘రిజర్వేషన్‌’  కింద మార్చేసి టికెట్‌ రేట్లను పెంచేసింది. దీంతో రైల్వే ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు..  టికెట్‌ రేట్లను సవరించాలంటూ అన్ని జోనల్‌ రైల్వేస్‌కు సూచించింది రైల్వే బోర్డు. అయితే ఈ ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో ఇది అమలులోకి వస్తుందని సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు.  ఒక ప్యాసింజర్‌సెగ్మెంట్‌ కంటే ట్రాన్స్‌పోర్టర్‌ ద్వారా రైల్వే శాఖ ఆదాయం (113 శాతం) పెరగడం విశేషం.