చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న పాస్టర్ అరెస్ట్!

తన చర్చికి వస్తున్న చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న కీచక పాస్టరును కర్నూల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి పాస్టర్ ఉప్పలపాటి రవీంద్ర ప్రసన్న కుమార్ అదే గ్రామంలో కోవనెంట్ చర్చి పేరిట క్రైస్తవ ప్రార్ధనా మందిరం ఏర్పాటు చేశాడు.అంతేకాకుండా నేషనల్ క్రిష్టియన్ బోర్డు ఆంధ్రప్రదేశ్ విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.  ప్రార్ధనల పేరిట చిన్నారి బాలికలను చేరదీస్తూ, వారి పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పాస్టర్ ప్రసన్న కుమార్ తీరుపై బాధిత ఎస్సీ బాలికలు తమ పెద్దలకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలికల బంధువులు  ఈ నెల 7వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నించిన ఎస్సై:
బాలికలను లైంగికంగా వేధిస్తున్న పాస్టర్ ప్రసన్నకుమార్ పై ఫిర్యాదు చేసినప్పటికీ తొలుత స్థానికి సబ్-ఇన్స్పెక్టర్ మారుతి కేసు రిజిస్టర్ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు, పాస్టర్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినట్టు స్థానికులు ఆరోపించారు.
జాతీయ బాలల హక్కుల కమిషన్ జోక్యంతో:
పాస్టర్ ఉప్పలపాటి ప్రసన్న కుమార్ తమను ఏవిధంగా లైంగికంగా వేదిస్తున్నాడో బాధిక ఎస్సీ బాలికలు వివరించడంతో హిందూ జనశక్తి సంస్థ నుండి సామాజిక, మహిళా హక్కుల కార్యకర్త ప్రేరణా తిరువైపాటి వెంటనే జాతీయ బాలల హక్కుల కమిషనుకు విషయాన్ని తెలియజేశారు. దీంతో కమిషన్ చైర్మన్ శ్రీ ప్రియాంక్ కానుంగొ జోక్యంతో పోలీసులు 12వ తేదీ అర్ధరాత్రి పాస్టరును హుటాహుటిన అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.