ఏపీకి వైద్య పరికరాల కంపెనీలు సరఫరా బంద్

బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నఆంధ్ర ప్రదేశ్ప్ర భుత్వానికి మరో షాక్‌ తగిలింది. నాలుగైదు సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర రాష్ట్ర ఎంఎస్‌ఐడిసి (వైద్య సర్వీసుల మౌళికాభివృద్ధి సంస్థ)కు భారత వైద్య పరికరాల పరిశ్రమల సంఘం కాషన్‌ రెడ్‌ నోటీసు జారీ చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖకు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అంటూ వైద్య పరికరాల ఉత్పత్తి దారుల జాతీయ యూనియన్‌ (ఏఐఎంఈడీ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ‘రెడ్‌ నోటీస్‌’ జారీ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే కంపెనీలు.. ఆంధ్రాతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ నోటీసులో హెచ్చరించింది. 
 
ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించింది. కొనుగోలు చేసిన పరికరాలకు బిల్లులు చెల్లించకుండా దీర్ఘకాలంగా జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ నోటీస్‌ జారీ చేసినట్లు వెల్లడించింది. ఏ పరిశ్రమ కూడా ముందస్తు నగదు చెల్లింపులు లేకుండా ఎంఎస్‌ఐడిసికి పరికరాలు అమ్మవద్దని సూచించింది. 
 
అలా విక్రయిస్తే తరువాత ఆ బిల్లులకు ఆయా విక్రయ సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాము విక్రయించిన పరికరాలకు బిల్లులు చెల్లించడం లేదని పదేపదే ఆర్ధిక, ఆరోగ్యశాఖలకు లేఖలు రాస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని ఇప్పటికే యూనియన్‌ ఆరోపించింది. 
 
గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చేసిన కొనుగోళ్లతో పాటు, ఇటీవల కరోనా సమయంలో చేసిన ఆర్‌టి-పిసిఆర్‌ కిట్లు, ఎన్‌95 మాస్కులు, వైసర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కిట్లు, డ్రైనేజ్‌ బ్యాగ్‌లు, వెరటిలేటర్లు, అనస్థీషియా సర్క్యూట్లు వంటి కొనుగోళ్లకు కూడా బిల్లులు చెల్లింపు జరగలేదు. దేశంలో వైద్య పరికరాలు ఉత్పత్తి చేసే ప్రతి కంపెనీకి ఈ యూనియన్‌లో సభ్యత్యం ఉంటుంది. దాదాపు 500 కంపెనీలకు యూనియన్‌  సభ్యత్వం ఉంది. చివరికి ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు  కూడా యూనియన్‌ లో సభ్యత్వం ఉండడం గమనార్హం. 
 
మరోవైపు ఈ సంస్థ అక్టోబరు రెండో వారంలోనే ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీకి లేఖ రాసినట్లు తెలుస్తున్నది. తమ యూనియన్‌కు చెం దిన కంపెనీలకు రూ.కోట్ల బిల్లులు బకాయిలున్నాయి. ఆ బకాయిలు మొత్తం వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకుంటే యూనియన్‌లో మెంబర్లుగా ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొనకుంటా రెడ్‌ నోటిస్‌ ఇస్తామని హెచ్చరించారు. 
 
అయినా ప్రభుత్వం స్పందించక పోవడంతో ఇప్పుడు ఇటువంటి తీవ్రమైన చర్య తీసుకోవలసి వచ్చింది. గత ఎనిమిది నెలల వ్యవధిలో దాదాపు రూ.800 కోట్లపైగా ఏపీఎంఎ్‌సఐడీసీ బకాయి పడింది. ఇందులో ఇప్పటి వరకూ రూ.150 నుంచి రూ.200 కోట్ల విలువైన బిల్లులకు మించి విడుదల చేసిన దాఖలాలు లేవు. 
 
అయినా ఇప్పుడు మళ్లీ రూ.800 కోట్లపైగా చెల్లింపులు చేయాల్సి ఉంది. కొవిడ్‌ సమయంలో సరఫరా చేసిన కంపెనీలకే రూ.329 కోట్లు ఇవ్వాల్సిఉంది. ఇక నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా కొనుగోలు చేసిన వాటికి మరో రూ.54 కోట్ల మేరకు పెండింగ్‌ బిల్లులున్నాయి.