అయోధ్యలో ఆలయం నిర్మించేందుకు స్థలం కేటాయించమని శ్రీ రామజన్మభూమి జన్మస్థాన్ ట్రస్ట్ ను కోరామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ట్రస్ట్ నుంచి వచ్చే స్పందన మేరకు అక్కడ ఆలయం లేదా భజనమందిరం నిర్మాణం పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఢిల్లీలోని టీటీడీ ఆలయ సలహా మండలి చైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ఉత్తరాదిలో ఆలయాల విస్తరణకు ఢిల్లీ సలహా మండలి కృషి చేస్తుందని చెప్పారు.
ఢిల్లీ, కురుక్షేత్ర సహా పలుచోట్ల టీటీడీ కి ఆలయాలున్నాయని తెలిపారు. జమ్ములో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని, 18 నెలల్లో ఆలయ నిర్మాణణం పూర్తి చేస్తామని ఆయన సుబ్బారెడ్డి వివరించారు.
గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇందుకోసం ఎపి రైతు సాధికారిక సంస్థతో ఎంఓయు చేసుకున్నట్లు చెప్పారు. గోఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలను రైతులకు గిట్టుబాటు బాటుధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందని తెలిపారు. తిరుమలశ్రీవారి ప్రసాదాలు, నిత్యాన్నదానం తో పాటు టీటీడీ అవసరాలకు గో ఆధారితఉత్పత్తులను సేకరిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

More Stories
కర్నూలు జిల్లాలో భారతదేశపు మొదటి ప్రైవేట్ బంగారు తవ్వకం
తొలిసారి సముద్ర మార్గంలో సింగపూర్‌కు ఆంధ్రా మామిడి!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్