మంత్రి మాలిక్ పై వాంఖడే మరదలు పోలీసులకు ఫిర్యాదు

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మరదలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీర్ వాంఖడే మరదలు హర్షదా దీనానాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో పాలుపంచుకున్నారా అని మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ట్వీట్ పై స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మంత్రి నవాబ్, మరో వ్యక్తి నిశాంత్ వర్మలపై ఐపీసీ సెక్షన్లు 354,354 డి, 503, 506, మహిళల అసభ్య ప్రాతినిథ్య చట్టం 1986లోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలని కోరుతూ హర్షదా దీనానాథ్ రెడ్కర్ గోరేగావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మంత్రి చేసిన ట్వీట్ ను హర్షదా తన ఫిర్యాదుకు జత పర్చారు. 

డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో సమీర్ వాంఖడేను బెదిరించేందుకే మాలిక్, వర్మలు తనపై ఆరోపణలు చేశారని హర్షదా చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కారణంగా పూణెలో నమోదైన కేసులో తనను ఇరికించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు పూణెలోని కోర్టులో పెండింగ్‌లో ఉందని ఆమె తెలిపారు.

సమీర్ వాంఖడే మరదలు మాదకద్రవ్యాల వ్యాపారంలో పాలుపంచుకున్నారా? అని మంత్రి అడిగిన నవాబ్ మాలిక్ ఇటీవల చేసిన ట్వీట్ తర్వాత ఇది జరిగింది. ఆ ట్వీట్‌లో నవాబ్ మాలిక్ ఇలా రాశారు: “సమీర్ దావూద్ వాంఖడే, మీ మరదలు హర్షదా దీనానాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారా? ఆమె కేసు పూణె కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మీరు సమాధానం చెప్పాలి. ఇదిగో రుజువు.” అంటూ ఆ కేసుకు సంబంధించిన పత్రం స్నాప్‌షాట్‌ను కూడా పోస్ట్ చేశాడు.

డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో నిందితులు సమీర్ వాంఖడేను నేరపూరితంగా బెదిరించేందుకు మాలిక్,  వర్మలను స్పాన్సర్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.  స్వార్థ ప్రయోజనాల కారణంగా పూణెలో నమోదైన కేసులో తనను ఇరికించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసు పూణెలోని కోర్టులో పెండింగ్‌లో ఉంది.

తనను తాను రాజకీయ విశ్లేషకుడిగా చెప్పుకునే వర్మ వదంతుల వ్యాపారి అని, తన క్లయింట్ తరపున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడని ఫిర్యాదులో  ఆమె తెలిపారు. ఫిర్యాదులో నవాబ్ మాలిక్‌ను కూడా “నిందితుడు”గా పేర్కొన్నారు. “14 సంవత్సరాల క్రితం జరిగిన ఆరోపించిన కార్యకలాపాలను ట్వీట్‌లో పేర్కొన్నారు. నిందితులు కేవలం నా బావను బెదిరించాలనుకుంటున్నారు. వారు నా స్థిరపడిన జీవితాన్ని నాశనం చేస్తున్నారు” అని ఫిర్యాదులో ఆమె ఆరోపించింది.