అత్యంత ప్రజాదరణ ఉన్న దేశాధినేతగా ప్రధాని మోదీ

ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ  అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. దేశాధినేతలపై అమెరికాకు చెందిన రేటింగ్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీకి 70 శాతం ప్రజామోదం ఉన్నట్టు తేలింది. 

ఆ తర్వాతి స్థానంలో 66 శాతంతో మెక్సికో అధ్యక్షుడు ఓబ్రేడర్ నిలిచారు. మూడోస్థానంలో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీకి 58 శాతం జనామోదం లభించింది. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 54 శాతంతో నాలుగోస్థానంలో నిలువగా, 44 శాతంతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఏడోస్థానానికే పరిమితమయ్యారు. 

ఈ ఏడాది ప్రారంభంలోనూ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ  ప్రపంచంలోనే బహుళ ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాధినేతగా నిలిచారు. ది గ్లోబల్ లీడర్ అప్రూవల్ లిస్ట్ పేరుతో 13 దేశాల అధినేతలకు లభించిన ప్రజామోదం గురించి మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది.

జాబితాలోని అధినేతలకు లభించిన ఆమోదం
1. నరేంద్రమోడి                             70 శాతం
2. లోపేజ్ ఓబ్రేడర్                          66 శాతం
3. మారియో డ్రాఘీ                         58 శాతం
4. ఏంజెలా మెర్కెల్                         54 శాతం
5. స్కాట్ మోరీసన్                          47 శాతం
6. జస్టిన్ ట్రూడో                             45 శాతం
7. జో బైడెన్                                44 శాతం
8. ఫూమియో కిషిదా                       42 శాతం
9. మూన్ జేఇన్                            41 శాతం
10. బోరిస్ జాన్సన్                        40 శాతం
11. పెడ్రో సాంచెజ్                          37 శాతం
12. ఇమాన్యుయెల్ మేక్రాన్                36 శాతం

13. జెయిర్ బోల్సోనారో                    35 శాతం