ఆధార్ ఉల్లంఘిస్తే రూ. 1 కోటి వరకు జరిమానా!

ఆధార్ చట్టంను ఉల్లంఘించేవారికి రూ. 1 కోటి వరకు జరిమానా విధించే అధికారాన్ని ఆధార్ ప్రాధికార సంస్థ ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్)కు ఇస్తూ కేంద్ర  ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. 2021 నవంబర్ 2 ఈ ఉడాయ్ (అడ్‌జ్యుడికేషన్ ఆఫ్ పెనాలిటీస్) రూల్స్2021 ప్రకటన విడుదలచేసింది. 
 
టెలికామ్ వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రైబ్యునల్ న్యాయనిర్ణేత అధికారి నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ అథారిటీగా ఉండనుంది. ప్రస్తుతమున్న ఆధార్ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అధికారం నియంత్రణ అధికారికి లేవు. కానీ ఇప్పుడు తాజా చట్టంతో అవి సమకూరాయి.
 
 ‘ప్రైవసీని కాపాడడం, ఉడాయ్‌కు స్వయం ప్రతిపత్తి అవసరం’ గురించి 2019లో ఆమోదించిన ఆధార్ చట్టం వాదిస్తోంది. దాంతో ఆధార్ చట్టంలో సివిల్ పెనాల్టీస్ వేసేలా కొత్త అధ్యాయం చేర్చారు. భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ కంటే తక్కువ ర్యాంకుఉన్న అధికారికి జరిమానా విధించే అధికారం ఉండదు. 
 
పైగా ఆ అధికారికి కనీసం 10ఏళ్లు లేక ఆపైన పనిచేసిన అనుభవం ఉండాలి. అంతేకాక చట్టంకు సంబంధించిన డిసిప్లయిన్స్ తెలిసి ఉండాలి. ఉడాయ్ కూడా అధికారిని నామినేట్ చేయవచ్చు. జరిమానాగా విధించే మొత్తాన్ని ఉడాయ్ నిధిలో జమాచేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలను తీసుకొనిరావడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఇతర శాసనాల (సవరణ) బిల్లు, 2019కి ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాలను అమలు చేయడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి రెగ్యులేటర్‌తో సమానమైన అధికారాలు లభించాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్ల డేటకు మరింత రక్షణ లభిస్తుంది.