ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై జగన్ వెనుకడుగు

ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యాసంస్థలతో విలీనం కావడమో, ప్రైవేట్  నడుపు కోవడమే చేయాలి అంటూ జారీచేసిన ఉత్తరువులు కారణంగా రాష్ట్రంలో శతాబ్దకాలంగా కొనసాగుతున్న పలు విద్య సంస్థలు సహితం మూతపడే పరిస్థితులు ఏర్పడడంతో పలు వర్గాల నుండి వస్తున్న నిరసనల దృష్ట్యా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెనుకడుగు వేశారు. 

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యథాప్రకారం నడుపుకోవచ్చని పేర్కొనడమే కాకుండా, ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన విద్యాసంస్థలకు తమ నిర్ణయానిు వెనక్కి తీసుకోవడానికీ అవకాశం కల్పిస్తునుట్లు తెలిపారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను అధికారులు ప్రస్తావించడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం ప్రకటించారు. 

‘ ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్‌ టీచర్లు చేస్తున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని వారిని సరెండర్‌ చేసి, ప్రైవేటుగా నడుపుకోవచ్చు. లేదా ఇప్పుడున్నది ఉన్నట్టుగా యథాప్రకారం నడుపుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది’ అని జగన్ స్పష్టం చేశారు. 

నడపలేని పరిస్థితుల్లో ఉను విద్యాసంస్థలను ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వానికి అప్పగిస్తే నాడు-నేడులో భాగంగా పునరుద్దరిస్తామని, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే, ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యథాప్రకారం నడుపుకోవచ్చని చెప్పిన సిఎం ఎయిడెడ్‌ పోస్టుల భర్తీ గురించి, ఉపాధ్యాయులకు సకాలంలో ఎయిడ్‌ విడుదల గురించి ఎటువంటి హామి ఇవ్వకపోవడం గమనార్హం.