
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 12 గంటలకు పైగా విచారించింది. విచారణ తర్వాత అతన్ని అరెస్టు చేసి మంగళవారం కోర్టు ముందు హాజరుపర్చింది. అనిల్ ను ఈడీ కస్టడీ రిమాండ్ కోరనుంది.
ఈడీ విచారణకు హాజరు కావాలని కోరుతూ పలు సమన్లు జారీ చేసినా అనిల్ కనీసం ఐదు సార్లు దాటవేశారు. ఎట్టకేలకు దర్యాప్తు అధికారుల ముందు హాజరైన అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించే సమయంలో సహకారం అందించని కారణంగా అతన్ని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు.
ఈడీ సమన్లుకు వ్యతిరేకంగా ముంబై హైకోర్టు ను ఆశ్రయించారు. అక్టోబర్ 29న హైకోర్టు ఆయన పిటీషన్ ను తిరస్కరిస్తూ దర్యాప్తు ఏజెన్సీ ముందు హాజరు కమ్మనమని ఆదేశించింది.
సోమవారం ఉదయం 12 గంటలకు ఈడీ కార్యాలయంకు చేరుకున్న ఆయనను రాత్రి 12 గంటల వరకు విచారిస్తూ ఉన్నారు. ఆయనను విచారించడం కోసం ఢిల్లీ నుండి అదనపు డైరెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ముంబైకి చేరుకున్నారు. వారు మాజీ మంత్రి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.
రూ.100 కోట్ల అక్రమాల రాకెట్ కు సంబంధించి అనిల్ దేశ్ ముఖ్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ విచారణ జరుపుతోంది.ముంబైలోని హోటళ్లు, బార్‌ల నుంచి ప్రతి నెలా రూ. 100 కోట్లు వసూలు చేయమని తొలగింపునకు గురైన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజ్‌ను అనిల్ దేశ్‌ముఖ్ అడిగారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు.
ముంబైలోని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వెలుపల ఈ ఏడాది ఫిబ్రవరి 25న పేలుడు పదార్థంతో కూడిన వాహనం కనిపించడంతో మొత్తం వివాదం బయటపడింది. దర్యాప్తులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సచిన్ వాజే ప్రమేయాన్ని గుర్తించింది. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం పరంబీర్ సింగ్‌ను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తొలగించింది.
పరంబీర్ సింగ్ ఆరోపణల తర్వాత బాంబే హైకోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను ఆదేశించింది.అప్పట్లో మహారాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు.
More Stories
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం
5జీ కోసం జియో లక్ష టవర్లు