తాలిబన్లతో భారత్ సైనికంగా అప్రమత్తం కావాలి

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో భారత్ అన్ని సమయాల్లో సైనికపరంగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా.  మోహన్ భగవత్ హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ సంస్థాపన సందర్భంగా నాగపూర్ లో జరిగిన వార్షిక విజయదశమి తన వార్షిక విజయదశమి ప్రసంగంలో వచ్చే వారం రష్యా ఆతిథ్యమిస్తున్న తాలిబాన్లతో చర్చల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నందున, భారతదేశం “అన్ని అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలి” అని చెప్పారు.
 
 “… సంభాషణ కోసం మార్గాలను తెరిచి ఉంచడం, వారి (తాలిబాన్) హృదయాన్ని మార్చే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవడం వంటి  అన్ని అవకాశాల కోసం భారత్ సిద్ధంగా ఉండాలి,” అని ఆయన సూచించారు. 
 
“తాలిబాన్ మారవచ్చు, కానీ పాకిస్తాన్ మారిందా? చైనా భారతదేశం పట్ల తన ఉద్దేశాన్ని మార్చుకుందా? హృదయ మార్పిడి, సంభాషణ పరిష్కార సమస్యల అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మనం ఇంకా సిద్ధంగా ఉండాలి, ”అని ఆయన పేర్కొన్నారు. రష్యా, టర్కీ, చైనా, పాకిస్తాన్ వంటి సహాయక దేశాలు తాలిబాన్లకు చూపించవద్దని ఆయన హెచ్చరించారు.

భారత్  వేచి చూసే విధానాన్ని ఎంచుకుందని చెబుతూ ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామంగా మారకూడదని,  ఉగ్రవాద గ్రూపులు ఆఫ్ఘన్ మట్టిని ఉపయోగించడానికి అనుమతించరాదని స్పష్టం చేసినదని ఆయన గుర్తు చేశారు. 

ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిణామాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదం పెరుగుతున్నట్లు కొంతమంది భద్రతా విశ్లేషకులు పేర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్  ప్రజల “భావోద్వేగ అనుసంధానం”ను వేగవంతం చేయవలసిన అవసరం ఏర్పడినది డా. భగవత్ స్పష్టం చేశారు.

“జమ్మూ, కాశ్మీర్‌లో తీవ్రవాదులు జాతీయ భావాలు కలిగిన వ్యక్తులపై, ముఖ్యంగా హిందువులు తమ ధైర్యాన్ని కోల్పోయే విధంగా లోయలో ఉగ్రవాద పాలనను తిరిగి ఏర్పర్చడం కోసం హింసాకాండను తిరిగి ప్రారంభిస్తున్నారు” అని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి, వాటికి అంతం చేయడానికి  ప్రయత్నాలు వేగవంతం కావాలని ఆర్ఎస్ఎస్ అధినేత పిలుపిచ్చారు.

కాశ్మీర్‌లో హింసాత్మక ఘటనల మధ్య ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేస్తూ చొరబాట్లు, దాడులు దొంగతనంగా జరిగే సరిహద్దుల వెంట నిఘా పెంచాలని భగవత్ ప్రభుత్వానికి సూచించారు. అంతర్గత భద్రతను పటిష్టం చేయవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. 
 
ఓటీటీ, మొబైల్ కంటెంట్‌లను తప్పనిసరిగా నియంత్రించాలని డా.  భగవత్ సూచించారు.దేశానికి హాని కలిగించే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో చూపించే కంటెంట్‌పై నియంత్రణ లేదని విచారం వ్యక్తం చేశారు.  కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత దాదాపు ప్రతీ వారికి మొబైల్ ఫోన్ ఉందని పేర్కొంటూ వారు సెల్ ఫోన్లలో చూసేది నియంత్రించాలని స్పష్టం చేశారు. 
 
భారతదేశంలో డ్రగ్స్ వాడకం కూడా పెరుగుతోందని భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు.  క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్ వంటివి దేశాల ఆర్థికవ్యవస్థను అస్థిరపరుస్తుందని హెచ్చరిస్తూ వీటిని ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. భారతీయ విలువల వ్యవస్థపై పలు రకాల దాడులు సాగుతున్నాయని పేర్కొంటూ ఇంట్లోని పిల్లలకు నైతిక విలువలు నేర్పాలని ఆయన సలహా ఇచ్చారు.
 
“దేశాన్ని కలిపే,  ప్రేమను ప్రోత్సహించే” సంస్కృతి అవసరాన్ని ప్రస్తావిస్తూ   అన్నింటినీ అంగీకరించగల సామర్థ్యం గల “సనాతన హిందూ సంస్కృతి” మాత్రమే ప్రపంచాన్ని రాడికలిజం, ఉగ్రవాదం, అసహనం నుండి కాపాడగలదని డా. భగవత్ స్పష్టం చేశారు. ‘స్వాధీనత నుండి స్వతంత్రత’ వరకు దేశ ప్రయాణం ఇంకా పూర్తికాలేదని చెబుతూ “భారతదేశం పురోగతి, గౌరవనీయమైన స్థానానికి ఎదగడం తమ స్వార్థ ప్రయోజనాలకు హానికరం అని భావించే శక్తులు ప్రపంచంలో ఉన్నాయి” అని ఆయన హెచ్చరించారు.

“జనాభా అసమతుల్యత” సమస్యను పరిష్కరించడానికి భారతదేశం తన జనాభా విధానాన్ని పునపరిశీలించాలని ఆయన సూచించారు.  “జనాభా విధానాన్ని మరోసారి పరిశీలించాలి. రాబోయే 50 సంవత్సరాలకు ఈ విధానాన్ని రూపొందించాలి. దానిని సమానంగా అమలు చేయాలి, జనాభా అసమతుల్యత ఓ సమస్యగా మారింది,” అని ఆయన పేర్కొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి చెబుతూ  దానిని “జయించటానికి” ప్రయత్నించే బదులు “పెంపకం” చేయడం ద్వారా సాధించుకోవాలని సూచించారు.  “ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలి” అని ఆయన చెప్పారు.