
రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించడంలో రాజకీయ వర్గం ఘోరంగా విఫలమైనదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ “మైనారిటీ అంటే ఏమిటి?” అని సుప్రీం కోర్ట్ నిర్వచింపలేక పోతున్నదని తెలిపారు. “రాజకీయ వర్గం ఘోరంగా విఫలమైంది. మనం రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించకపోతే మమ్మల్ని ప్రశ్నించడం మీడియా విధి” అని ఆయన పేర్కొన్నారు.
ముస్లిం సమాజంలో సంస్కరణలు తీసుకురావాలనే ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదనలకు గట్టి మద్దతు దారునిగా, ట్రిపుల్ తలాక్ నేరపూరితమైన చర్య కట్టడికి మద్దతు ఇచ్చిన కేరళ గవర్నర్ “ఊహాజనిత ముస్లిం ప్రశ్న” కారణంగా విభజన జరిగిందని చెప్పారు. “విభజన నుండి మనం ఏదైనా పాఠం నేర్చుకున్నారా?” అని ప్రశ్నించారు.
భారతదేశాన్ని మేల్కొల్పిన రెండు అంశాలు ఉన్నాయని చెబుతూ అవి రాజ్యాంగ పరిషత్ అస్పృశ్యత నిర్మూలన కావించడం, ప్రత్యేక ఓటర్ల రద్దుపై నిర్ణయం తీసుకోవడం అని తెలిపారు. “మైనారిటీ హక్కుల పరిరక్షణపై, రాజ్యాంగం ‘భాషా మైనారిటీ’ గురించి ప్రస్తావించింది. వారికి విద్యా సంస్థలను స్థాపించే హక్కు ఉంటుంది” అని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గుర్తు చేశారు.
రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఉన్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ షా బానో కేసులో విభేదాల కారణంగా 1986 లోమంత్రివర్గం నుండి నిష్క్రమించారు. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మతతత్వ దేశాలలో మైనారిటీ హక్కులు అవసరమని, భారతదేశంలో కాదని ఆయన స్పష్టం చేశారు. భారతీయ నాగరికత మతం ద్వారా నిర్వచించబడలేదని తేల్చి చెప్పారు.
“హిందూ రాష్ట్రం అనే పదం మన గ్రంథాలలో ఏదీఎక్కడా ఉపయోగించ లేదు. భారతీయ నాగరికత మతం ద్వారా నిర్వచించబడలేదు. ఇతర నాగరికతలు మతం, జాతి, భాష ద్వారా నిర్వచించాయి. రాజ్యాంగ సభలో హిందూ, సిక్కు, జైన, బౌద్ధ మతాలు ఉన్నాయి” అని వివరించారు.
. హిందువు అంటే మతం విషయంలో విశ్వాసం లేదా ఆచరణల ఏకరూపత కాదని ఆయన స్పష్టం చేయడం. ప్రతి ఒక్కరినీ రక్షించడం రాజకీయ వ్యవస్థ విధి అని పేర్కొంటూ మీరు హిందూ రాష్ట్రాన్ని చెబుతున్నప్పుడు, మీరు దానిని ముస్లిం మతతత్వంతో సమానం లేదా క్రైస్తవ దైవపరిపాలన అని తెలిపారు.
“పాకిస్తాన్‌లో, మైనారిటీలు వివక్షకు గురైనందున మైనారిటీ హక్కులు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో, రాజ్యాంగం సమాన హక్కులను ఇస్తుంది. భారతదేశంలో, మతం ఆధారంగా వివక్ష భావన లేదు,” అని కేరళ గవర్నర్ చెప్పారు.
విభజన భాష మాట్లాడే వారిని, వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించరాదని ఆయన కోరారు. “మన భారతీయత అనే భావనను మనం నిర్మించుకోవాలి. భారతదేశంలో, ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు వేర్వేరు దేవుళ్లను ఆరాధిస్తారు. వారు బెదిరిపోరు. భారతీయుడిగా ఉన్నందున, ఈ సమస్యలు తగ్గవు, “అని ఆయన హితవు చెప్పారు.
More Stories
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
జస్టిస్ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!