దుర్గ అమ్మ వారి గుడి దగ్గర అన్య మత ప్రచారం

నవరాత్రుల ప్రారంభం రోజుననే విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ప్రసిద్ధి చెందిన కనకదుర్గ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో అన్యమత ప్రచారం జరగడం కలకలం రేపింది.ద సరా శరన్నవరాత్రి దసరా ఉత్సవాల ప్రారంభం రోజుననే హిందువుల మనోభావాలను అవమానపరిచే విధంగా కనక దుర్గ అమ్మవారి ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేసే ఎ ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో స్క్రీన్ పై క్రైస్తవ బోధకుడి ప్రసంగాన్ని ప్రసారం చేశారు.

అమ్మవారి ఉఈ త్సవాలను ప్రసారం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వపు సమాచార, పౌరసంబంధాల శాఖకు అప్పగించారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారం బాధ్యతను ఈ శాఖ అధికారులు స్థానిక ఛానల్ కు అప్పగించారు. గురువారం రాత్రి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేసిన కాస్సేపటికి అన్యమత బోధకుడి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. దానితో ఆగ్రహం చెందిన భక్తులు రాళ్లతో  ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో   స్క్రీన్ ను ధ్వంసం చేశారు.

భక్తుల ఆగ్రవేశాలను గ్రహించిన దేవాలయం ఈవో దృష్టి వెంటనే  ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా జరిందా? లేక పొరపాటున జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనలు ప్రసారంపై విశ్వ హిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమ్మవారి భక్తులతో కలిసి దుర్గ గుడి ఈవోని కలిసి దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని ఈఓ వారికి హామీ ఇచ్చారు.

కాగా, ఏపీలో ‘జగనన్న అన్యమత ప్రచారం’ పథకం ప్రారంభించినట్లున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెజవాడ ఇంద్రకీలాద్రి వద్ద దసరా ఉత్సవాల ఏర్పాటులకు బదులు మత మార్పిడులు కోసం అన్యమత ఉత్సవ ప్రచారం కోసం ఏర్పాట్లు బాగా చేసినట్టుందని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో హిందూ మతంపై ప్రణాళికాబద్దంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దసరా వేళ అమ్మవారి చెంత ఒక వైపు ఆలయానికి వైసీపీ రంగుల విద్యుత్ దీపాలు, మరో వైపు అన్యమత ప్రచార హోరు’ అని లంకా దినకర్ పేర్కొన్నారు.

మరోవంక, దుర్గగుడి ముఖమండపం ముందు పాలకమండలి సభ్యుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వివాదాలకు దారితీసింది.  వీఐపీ, వీవీఐపీ వెళ్లే మార్గంలో పాలకమండలి కోసం ప్రత్యేక సోఫాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అధికారుల తీరుపై ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే పాలకమండలి సభ్యుల కోసం చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ప్రభుత్వ కార్యాలయాలకు ఇకనుండి అధికార పార్టీ జెండా రంగులు వేయమని చెబుతూ రాష్ట్ర హైకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించిన రోజుననే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పర్చిన దీపాలకు వైసిపి జెండా రంగులు వేయడం కూడా వివాదాస్పదంగా మారింది.