ఎయిర్ చీఫ్ స్టాఫ్‌గా వివేక్ రామ్ చౌదరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఐఏఎఫ్ చీఫ్‌గా కొనసాగుతున్న రాకేశ్‌కుమార్ సింగ్ భదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ క్రమంలో కొత్తగా చీఫ్ ఎంపికపై కేంద్రం దృష్టి పెట్టింది. వీఆర్ చౌదరి ఈ ఏడాది జూలై 1న డెప్యూటీ ఎయిర్ చీఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1982, డిసెంబర్ 29న ఐఏఎఫ్‌లో చేరారు. దాపు 38 సంవత్సరాల కెరీర్‌లో భారత వైమానిక దళానికి చెందిన వివిధ రకాల ఫైటర్, ట్రైనర్ విమానాలను నడిపారు.
సున్నితమైన లడఖ్ ప్రాంతంలో అలాగే ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దేశ గగనతలాన్ని రక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడం వల్లే పదోన్నతికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మిగ్ -21, మిగ్ -23 ఎంఎఫ్, మిగ్ -29, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 3,800 గంటలు ప్రయాణించిన అనుభవం ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, వెల్లింగ్టన్ పూర్వ విద్యార్థి. ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన పశ్చిమ ఎయిర్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పని చేశారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500