వ‌చ్చే ఏడాదినాటికి 900 కి.మీ. మైట్రో రైలు సర్వీసులు

దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే ఏడాదినాటికి 900 కి.మీ. మేర మైట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి తేవ‌డానికి ప్ర‌ణాళిక రూపొందిస్తున్న‌ట్లు కేంద్ర ప‌ట్టణాభివృద్ధిశాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. 

 ఆయ‌న ఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ఢ్‌-డాన్సా బ‌స్టాండ్ మెట్రో సెక్ష‌న్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలసి ప్రారంభిస్తూ ఆధునిక‌, వేగ‌వంత‌మైన ర‌వాణా సౌక‌ర్యాల కోసం దేశ‌వ్యాప్తంగా మెట్రో రైల్ వ్య‌వ‌స్థ‌ల విస్త‌ర‌ణ ప‌నులు ముమ్మ‌రం చేశామ‌ని తెలిపారు.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మెరుగైన ప్ర‌జా ర‌వాణా కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని హ‌ర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో 740 కిలోమీట‌ర్ల మేర‌కు మెట్రో రైల్ లైన్లు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. వివిధ న‌గ‌రాల ప‌రిధిలో 1000 కి.మీ విస్తీర్ణంలో మెట్రో రైల్ లైన్లు నిర్మాణంలో ఉన్నాయ‌ని చెబుతూ ఇవ్వన్నీ పూర్తయితే మొత్తం 2000 కిమీ రైల్ లైన్లు అందుబాటులోకి రగలవని తెలిపారు.

ఈ మెట్రో సర్వీసుల్లో ప్ర‌తి రోజూ 85 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తున్నార‌ని హ‌ర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఢిల్లీ మెట్రో వివిధ విజయాలు సాధించిందని ప్రశంసించారు. 

మెట్రో వంటి ట్రైల్‌బ్లేజర్ రవాణా వ్యవస్థత, దేశ రాజధాని లండన్, న్యూయార్క్ వంటి ప్రపంచ స్థాయి నగరంగా మారే అవకాశం ఉందని భరోసా వ్యక్తం చేశారు. మెట్రో రైల్ వ్య‌వ‌స్థ‌ల‌తో పట్ట‌ణాల రూపురేఖ‌లే మారిపోయాయ‌ని అభిప్రాయ ప‌డ్డారు.