జస్టిస్‌ కనగరాజు నియామకం సస్పెండ్ చేసిన హైకోర్టు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంకు రాష్ట్ర హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జస్టిస్‌ కనగరాజు నియామకాన్ని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.  ఈ జీవోను ఆరు వారాలపాటు నిలుపుదల చేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజు నియామకాన్ని.. న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని హైకోర్టు సస్పెండ్ చేసింది. 
 
కనగరాజు నియామకం చెల్లదని న్యాయస్థానం ప్రాథమికంగా అభిప్రాయపడింది. పిటిషనర్ తరపు వాదనలు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వినిపించారు. ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ కనగరాజు ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 
 
 కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై న్యాయంస్థానం మండిపండి. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీని ఇవాళ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. 
 
దీంతో వారు ధర్మాసనం ముందు హాజరయ్యారు. అక్టోబరు 6వ తేదీలోపు రంగులు తొలగించాలని ఆదేశిస్తూ.. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు  గ్రీన్ సిగ్నల్‌

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటింగ్‌పై సింగిల్‌ జడ్జి ఇచ్చని తీర్పును  హైకోర్టు డివిజనల్ బెంచ్‌ కొట్టివేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ త్వరలో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించనుంది. రాష్ట్రంలో 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8న  పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.