ఎప్పట్లానే అసలు హోం మంత్రి మహమూద్ అలీ అనే వ్యక్తి ఎక్కడా కనీసం సీన్ లో కనిపించడం లేదని ఆయన గుర్తు చేశారు. అసలు ఈ వ్యవహారంపై స్వయంగా రాష్ట్ర హోం మంత్రి ఒక్కసారి ప్రజల ముందుకు రాలేదని విస్మయం వ్యక్తం చేశారు. మీడియా ఎదుట చిన్న మాట కూడా మాట్లాడలేదని, అసలు కేసు విచారణ ఏ స్థాయిలో ఉందో డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ప్రజలకు వివరించలేదని ఆయన తెలిపారు.
ఓవైపు ఘోరమైన దుర్ఘటన జరిగి, ఘటన జరిగి ఇన్ని రోజులు అయినా అనుమానితుడు దొరక్కుండా తప్పించుకుంటోన్న వేళ, నగరం నడి బొడ్డులో ఇంత దారుణ పరిస్థితులు ఉన్న వేళ, తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి వర్యులు చీకట్లో, ముసుగు వెనుక దాచుకోకుండా, బాధ్యతలు విస్మరించుకుండా, బయటకు వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు పట్టించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అసలు హోం మంత్రి మహమూద్ అలీ తన బాధ్యతలు విస్మరించినందుకు రాజీనామా చేయాలని
కృష్ణ సాగర్ రావు డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు నిర్వహించడం ఆయనకు చాతకాకపోతే దిగిపోవడమే మంచిందని హితవు చెప్పారు .
More Stories
సైబరాబాద్, మల్కాజిగిరి కార్పోరేషన్లకు రూ 500 కోట్లు ఏమైన్నట్లు!
`దురంధర్ ది రివేంజ్’ సినిమా వీక్షించిన కిషన్ రెడ్డి
హైడ్రా పేరుతో గిరిజన ఇళ్లపై దాడి