“నార్కోటిక్స్ జిహాద్”, “లవ్ జిహాద్” పై కేంద్రం చట్టం తేవాలి

కేరళ క్యాథలిక్ బిషప్ “నార్కోటిక్స్ జిహాద్” వాఖ్యలు రాష్ట్రంలోని పార్టీల మధ్య రాజకీయ దుమారం సృష్టించడంతో, ఈ ఆరోపణ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం స్వరాన్ని ప్రతిధ్వనించిదని,  “నార్కో-టెర్రరిజం”,  “లవ్ జిహాద్” తో వ్యవహరించడానికి ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనే క్రైస్తవ సమాజం స్వరాన్ని  తెరపైకి తీసుకు వచ్చినదని అంటూ బిజెపి బిషప్ కు బాసటగా నిలిచింది.

“పవిత్ర ఆరాధన సమయంలో, కేరళ పాలాకు చెందిన అత్యున్నత బిషప్ జోసెఫ్ కల్లరంగట్ జోక్యం ఆయన డియోసెస్‌ మేల్కొలుపు పిలుపు మాత్రమే కాదు, లవ్ జిహాద్, నార్కో-ఉగ్రవాదం బాధితుల ఆవేదన.  లవ్ జిహాద్, మాదకద్రవ్యాల దుర్వినియోగ బాధితుల కేసులు పెరుగుతున్నాయి “అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ తెలిపారు.

దర్యాప్తు సంస్థల నుండి సమాచారం ఉన్నప్పటికీ కేరళ ప్రభుత్వం వాస్తవాన్ని గుర్తించలేదని వడక్కన్ ఆరోపించారు. యువతులను “లవ్ జిహాద్” పేరుతో ఆకర్షించి, వస పరచుకోవడం, ఆ తర్వాత విదేశాల జైళ్లలో మగ్గిపోతుండటం గురించి వివిధ చర్చిల నుండి సమాచారం వస్తుండడంతో ఈ సమస్యని బిషప్ కౌన్సిల్ లేవనెత్తినదని ఆయన పేర్కొన్నారు. దీనిని “మానవ అక్రమ రవాణా”గా పరిగణించాలని స్పష్టం చేశారు. 

“వివిధ వర్గాలలో పెరుగుతున్న మాదకద్రవ్యాల దుర్వినియోగం కుటుంబాలలో అశాంతిని సృష్టిస్తున్నది. వినాశకరమైన స్థాయిలలో సామాజిక-ఆర్థిక రుగ్మతను సృష్టించింది” అని వడక్కన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అంశాలపై కేంద్రం ఒక చట్టం తీసుకు రావాలని, నార్కో ఉగ్రవాదం, లవ్ జిహాద్ కేసులను పరిష్కరించడాన్నికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని వడక్కన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.