మీ విజయాలు ఓటమి ఆలోచనా ధోరణని ఓడించాయి

 ‘మీ విజయాలతో ఓటమి యొక్క ఆలోచనా ధోరణని ఓడించాయి. ఇది పెద్ద విషయం’ అని టోక్యో పారాలంపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను సత్కరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వారిని ప్రశంసించారు. దేశాన్ని ఎలా చైతన్య పర్చవచ్చో తెలియజేశారని, మీ ద్వారా చిన్న విషయాలు కూడా దేశాన్ని ఎంతో చైతన్యపరచగలవని, పాఠశాలలు, ప్రాంతాలను సందర్శించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పతాక విజేతలకు ప్రధాని తన నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన పారాలంపిక్స్‌లో 9 ఈవెంట్స్‌లో భారత్‌ తరుపున 54 మంది క్రీడాకారులు పాల్గని 19 పతకాలను సాధించారు. ఐదు గోల్డ్‌, ఎనిమిది సిల్వర్‌, ఆరు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. వారి నుండి తానెంతో స్ఫూర్తి పొందానని సత్కార సభలో మోదీ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో పంచుకున్నారు.

షట్లర్‌ కృష్ణ నగార్‌ స్వర్ణ పతాకం గెలిచిన తర్వాత… ఇది కోవిడ్‌ -19 యోధులకు అంకితమివ్వగా… మీ నిర్ణయం నస్సుకు హత్తుకుపోయిందని, ఆ ఆలోచన ఎలా వచ్చిందని ప్రధాని ప్రశ్నించారు. ఆరోగ్య కార్యకర్తలు వారి గురించి ఆలోచించకుండా విధులు నిర్వర్తించారని, అదే తనను వారికి అంకితమిచ్చేలా చేసిందని నగర్ తెలిపారు. 

పారా క్రీడాకారుల విజయాలు.. క్రీడా సంస్కృతిని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని మోదీ  పేర్కొన్నారు. పారా క్రీడాకారులకు కోచింగ్‌పై వర్క్‌షాప్‌ అవసరమని అనుకుంటున్నాని, పుస్తకం కూడా రాయవచ్చునని తెలిపారు.