అత్యుత్తమ విద్యాసంస్థగా మరోసారి ఐఐటి మద్రాస్‌

భారత్‌లో అగ్రగామి విద్యాసంస్థల్లో మరోసారి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటి మద్రాస్‌) నిలిచింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌ 2021కఁ గానూ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత దక్కించుకోవడం వరుసగా ఇది మూడవ సారి. 
 
 ఆరో ఎడిషన్‌లో ఎనిమిది ఐఐటీలు, రెండు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు దేశంలోని మొదటి పది ఇంజినీరింగ్‌ సంస్థల్లో చోటు దక్కించుకున్నాయి. టాప్‌ టెన్‌ జాబితాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌ దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
 
మొత్తం మీద ఇంజనీరింగ్‌ విభాగాల్లో తొలి ర్యాంక్  సాధించడం గమనార్హం. ఈ ఫలితాలను విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్‌ వర్చువల్‌ విధానంలో విడుదల చేశారు. ఐఐఎస్‌సి బెంగళూరు తన హోదాను నిలబెట్టుకుంది. దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒక్కటిగా ఇదిని లిచింది.మొత్తమ్మీద  ర్యాంకింగ్‌లో దీనికి రెండో స్థానం లభించింది. ఐఐటి బొంబై మూడవ స్థానంలో ఉంది.
 
ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్‌, ఐఐటి ఖరగ్‌పూర్‌లు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. జవహర్‌లాల్‌ నెహ్రు యూఁవర్శిటీ, బెనారస్‌ హిందూ యూనివర్శిటీ తొమ్మిది, పది ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. ఇక మెడికల్‌ కాలేజీ విషయానికి వస్తే ఎయిమ్స్‌ ఢిల్లీ తొలి స్థానంలో నిలువగా, పిజిఐఎంఇఆర్‌ చండీఘర్‌, వెల్లూరులో క్రిష్టియన్‌ మెడికల్‌ కాలేజీ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
 
బి-స్కూల్‌ విషయంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) అహ్మదాబాద్‌ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలువగా… ఫార్మసీ విద్యా విభాగంలో జామియా హమ్‌దార్డ్‌ టాప్‌లోనిలిచింది. కాలేజీ విషయాల్లో మిరండా హౌస్‌ తొలి ర్యాంక్, లేడీ శ్రీరాం కాలేజ్‌ ఫర్‌ ఉమన్‌, లయోలా కాలేజ్‌ చెన్నై తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
 
కాగా, ఎన్‌ఐఆర్‌‌ఎఫ్ ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) కిందికి జారిపోయింది. గత ఏడాది బెస్ట్ యూనివర్సిటీల్లో ఆరో స్థానంలో నిలిచిన హైదరాబాద్ యూనివర్సిటీ.. 2021 ర్యాంకుల్లో తొమ్మిదో స్థానానికి దిగజారిపోయింది. అయితే ఇంజనీరింగ్ కాలేజీల ర్యాంకింగ్‌లో మాత్రం ఐఐటీ హైదరాబాద్‌ గత ఏడాది వచ్చిన ఏడో స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంది.