కశ్మీర్‌ వేర్పాటు వాద నేత గిలానీ కన్నుమూత

కశ్మీర్‌ వేర్పాటు వాద నాయకుడు, కాశ్మీర్ ను పాకిస్థాన్ లో విలీనం చేయాలని సూచించిన పాకిస్థాన్ అనుకూల నేత  సయ్యద్‌ అలీ షా గిలానీ బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 92 ఏండ్లు. వేర్పాటు వాద సంస్థ హురియత్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ పదవి నుంచి గిలానీ జూన్‌లో వైదొలిగారు. 

పాకిస్తాన్ అధికారిక సంతాపం పాటిస్తుందని, తమ దేశ జెండా సగం ఎత్తులో ఎగురుతుందని  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.  మూడు సార్లు జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికైన గిలానీ దశాబ్దానికి పైగా గృహ నిర్బంధంలో ఉన్నారు.  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వరుస దాడులు, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో అతను స్థాపించిన హురియత్ లోని రెండు వర్గాలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మృతి చెందాడు.

అతని అంత్యక్రియలకు పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా సంస్థ ఇంటర్నెట్ సస్పెండ్‌తో సహా లోయ అంతటా భద్రతా సంస్థలు ఆంక్షలు విధించాయి, కర్ఫ్యూ విధించబడుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  ఆయన అభీష్టం మేరకు శ్రీనగర్ లోని అమరవీరుల స్మశాన వాటికలో అతనిని ఖననం చేస్తామని పాకిస్థాన్ కు చెందిన గిలానీ ప్రతినిధి అబ్దుల్లా గిలానీ ప్రకటించారు. అయితే అందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనబడటం లేదు.


ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ వచ్చాడు. కాశ్మీర్  సమస్యకు ఇస్లామాబాద్ సాంప్రదాయకంగా అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా పర్వేజ్ ముషారఫ్ నాలుగు అంశాల సూత్రాన్ని ప్రతిపాదించినపుడు వ్యతిరేకించిన  ఏకైక వేర్పాటువాద నాయకుడు. 
 
సెప్టెంబర్ 29, 1929 న, బందిపూర్‌లోని వులార్ సరస్సు ఒడ్డున ఉన్న జుర్మాంజ్ అనే గ్రామంలో జన్మించిన గిలానీ వేర్పాటువాద రాజకీయాలకు ప్రతిబింబంగా మారాడు.  పాఠశాల ఉపాధాయునిగా ప్రారంభమై తన రాజకీయ జీవితాన్ని సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్  నాయకుడు మౌలానా మొహమ్మద్ సయీద్ మసూది ఆధ్వర్యంలో ప్రారంభించాడు, 
 
కానీ వెంటనే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంపై వ్యతిరేకంగా కాశ్మీర్ విభజన “అసంపూర్ణ అజెండా”తో పనిచేస్తున్న సామజిక- మత సంస్థ జమాత్-ఇ-ఇస్లామీకి వెళ్ళాడు. జమాత్ కు బలమైన సోసోర్ నుండి మొదటిసారి 1972లో శాసన సభకు ఎన్నికయ్యాడు. 1987 లో కశ్మీర్‌లో ఉగ్రవాదం చెలరేగడంతో చివరి పదవీకాలం అకస్మాత్తుగా ముగిసింది.
 
భారీ ఎత్తున రిగ్గింగ్ తో జరిగిన ఎన్నికలుగా అపఖ్యాతి చెందిన 1987 ఎన్నికలలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులుగా ఎన్నికైన నలుగురిలో జిలాని ఒకరు.  ఈ ఎన్నికల్లో ఎన్‌సి-కాంగ్రెస్ కలయికకు తీసి, లోయలో ఉగ్రవాదం తీవ్రరూపం దాల్చడానికి దారితీసింది.

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయుధ పోరాటానికి తీవ్రమైన మద్దతుదారుడు జిలాని, 1993 లో హురియత్ కాన్ఫరెన్స్ ఏర్పడినప్పుడు ఏడుగురు కార్యనిర్వాహక సభ్యులలో జిలానీ ఉన్నారు. అయితే కశ్మీర్‌పై తీవ్రవాదానికి, అస్థిరమైన భావజాలానికి ఆయన మద్దతు పలుకుతూ ఉండడంతో వారిలో తీవ్రమైన విబేధాలు ఏర్పడ్డాయి.  చివరకు 2003లో విభజనకు గురయింది.

2004 లో, గీలానీ జమాత్-ఇ-ఇస్లామి ఉగ్రవాదానికి దూరమైనప్పుడు దాని నుండి విడిపోయి,  తెహ్రీక్-ఇ-హురియత్ అనే సొంత రాజకీయ సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. గత రెండేళ్లుగా జిలానీ మంచంకి పరిమితమై, ఎవ్వరికీ అందుబాటులో లేకుండా ఉన్నాడు. అయితే  గత సంవత్సరం జూన్ 30 న తాను స్థాపించిన హురియత్ నుండి నిష్క్రమిస్తూ అందరికి ఆశ్చర్యం కలిగించాడు. 

 
ఈ ఏడాది ప్రారంభంలో జమ్మూ జైలులో నిర్బంధంలో మరణించిన తన డిప్యూటీ మహ్మద్ అష్రఫ్ సెహ్రాయ్‌కు పగ్గాలు అప్పగించాడు.
ప్రజల ఆకాంక్షల మేరకు కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని గీలాని చెప్పినప్పటికీ, అతను పాకిస్తాన్‌లో విలీనానికి తీవ్రమైన మద్దతుదారుడు. గత సంవత్సరం, పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నిషన్-ఇ-పాకిస్తాన్‌ను ప్రదానం చేసింది.

ఉగ్రవాద నిధుల కేసులో హురియత్‌తో సహా 18 మంది వేర్పాటువాద నాయకులను ఇప్పటి వరకు కశ్మీర్ నుండి అరెస్టు చేసిన ఎన్ఐఏ  లోయలో అశాంతిని రేకెత్తించడానికి వారు పాకిస్తాన్ నుండి నిధులు అందుకున్నామని ఆరోపించింది. ఏజెన్సీ గీలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్‌ను ఛార్జిషీట్‌లో పేర్కొంది, వారు విభజన కోసం ఒత్తిడి చేస్తున్నారని,  శాంతికి ఆజ్యం పోశారని స్పష్టం చేసింది.

ఫిబ్రవరి, 2019 లో ఎన్ఐఏ ఈ కేసులో ఉమర్ ఫరూక్, గీలాని కుమారుడు నసీం గీలాని ఇళ్లపై దాడులు జరిపింది. మార్చి 2019 లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విదేశీ మారకపు చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు చేస్తూ 10,000 డాలర్లు అక్రమంగా కలిగి ఉన్నారనే 17 ఏళ్ల పాత కేసులో గిలానీకి రూ 17.40 లక్షల జరిమానా విధించింది.