హోంమంత్రి సుచరిత ఎస్సి మూలాలపై విచారణ 

వై ఎస్ జగన్  మోహన్  ప్రభుత్వంలో క్రైస్తవులుగా మారి, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారుగా రిజర్వేషన్ సదుపాయాలు అనుభవిస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు, రాజకీయ నాయకులకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటువంటి వారికి కీలక పదవులు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఇటువంటి ఆరోపణలపై జాతీయ షెడ్యూల్ కులాల కమీషన్ తీవ్రంగా స్పందిస్తున్నది. వాటిపై విచారణ జరిపి, సత్వరం నివేదికలు పంపమని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తున్నది. అయినా ప్రభుత్వ అధికారులు పలు సందర్భాలలో లెక్కలేన్నట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. 
 
తాజాగా, హోమ్ మంత్రి హోంమంత్రి మేకతోటి సుచరిత షెడ్యూల్డ్‌ కులాల హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై జాతీయ ఎస్సీ కమిషన్‌ విచారణకు ఆదేశించింది. వారం రోజుల్లో విచారణ జరపాలని గుంటూరు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ను ఆదేశించింది.
 
సుచరిత ఎస్సీ హోదా దుర్వినియోగం చేస్తున్నారంటూ లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం సంస్థ జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఒక న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జీసె్‌సను ప్రార్థిస్తానని చెప్పారంటూ, ఆ క్లిప్పింగ్‌ను జతచేసి జూన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కమిషన్‌ ఆదేశించింది. 

మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుల ధ్రువీకరణ విషయంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఆమెపై వచ్చిన ఆరోపణలను రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ జిల్లా కలెక్టర్ కు పంపుతూ, తగు విచారణ జరపమని ఆదేశించారు. అయితే కలెక్టర్లు మారుతున్నా విచారణ ఒక కొలిక్కి రావడం లేదు. 

కాగా మాజీ కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై సివిల్‌ సర్వీసెస్‌ కమిషన్‌కు ఈ సంస్థ ఫిర్యాదు చేసింది.  సిఐడి విభాగం అధిపతి  పివి సునీల్ కుమార్ క్రైస్తవుడిగా ఉంటూ హిందువులపైపూరక ప్రసంగాలు చేస్తున్నట్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్వయంగా ఇటువంటి ఫిర్యాదు చేశారు. 

డా. విద్యాసాగర్ కులవివాదంపై విచారణ 

ఇలా ఉండగా, ఐఎఎస్ గా ఉద్యోగ విరమణ చేసిన డా. ఎ విద్యాసాగర్  పై వచ్చిన వివాదంపై విచారణ జరిపి, కుల ధ్రువీకరణ నివేదిక సమర్పించాలని ప్రకారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సి ఎస్ పురం తహశీల్ధార్ ను గత వారం ఆదేశించారు. సి ఎస్ పురం అరివేముల గ్రామం డా. విద్యాసాగర్  స్వస్థలం. హైదరాబాద్ కు చెందిన ఏవి రమణ ఫిర్యాదుపై స్పందిస్తూ ఈ ఆదేశం ఇచ్చారు.

రమణ ఫిర్యాదు మేరకు తాను, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేసిన తన భార్య రత్నప్రభ తాము షెడ్యూల్డ్ కులాలకు చెందిన `ఆది ఆంధ్ర’కు చెందినవారమని చూపుతూ ఆధారంగా తన బదిలీ సర్టిఫికెట్ ను  హైదరాబాద్ పోలీసులకు 2012లో సంపారించారు. దానిని పరిశీలించమని ఎసిపి సి ఎస్ పురం ఎంఆర్ఓ కు లేఖ వ్రాయగా, విచారణలో `మాదిగ’గా తేలినదని, అన్ని హిందువుల ఆచారాలను అనుసరిస్తుంటారని ఎంఆర్ఓ తన నివేదికలో తెలిపారు.

`ఆది ఆంధ్ర’ కులం అని చెప్పుకొంటున్న డా. విద్యాసాగర్ వాస్తవానికి `మాదిగ’ వర్గంకు చెందిన వారని, అయితే హిందూ ఆచారాలను అసలు పాటించారని రమణ ఆరోపించారు. ఆయన వివాహం కూడా హిందూ ఆచారాల ప్రకారం జరగలేదని స్పష్టం చేశారు.

క్రైస్తవ ఆచారాలను పాటిస్తున్నారని చెప్పేందుకు సాక్ష్యంగా ఆయన తల్లితండ్రుల సమాధుల వద్ద క్రైస్తవ చిహ్నాలు ఉండడాన్ని ప్రస్తావించారు. సికింద్రాబాద్ లోని మెజిస్ట్రేట్ కోర్ట్ విచారణలో ఆ విషయాన్నీ డా. విద్యాసాగర్ స్వయంగా అంగీకరించారని కూడా చెప్పారు. రమణ ఫిర్యాదుపై సవివరంగా విచారణ జరిపి, నివేదిక సమ్పరించామని ప్రకాశం కలెక్టర్ తహశీల్ధార్ ను కోరారు.