గ్రేటర్ హైదరాబాద్ ను వణికిస్తున్న డెంగ్యూ

గ్రేటర్ నగరానికి మొన్నటివరకు కరోనా వైరస్ వణికించగా, ప్రస్తుతం డెంగ్యూ విజృంభణ చేస్తూ ప్రజలను ఆసుపత్రుల బాట పట్టిస్తుంది. ప్రభుత్వం 650 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో వస్తున్నట్లు, ప్రధానంగా ఫీవర్, కింగ్‌కోఠి, ఆసుపత్రులకు ఎక్కువ నమోదైతున్నట్లు పేర్కొంటున్నారు. 

ఇళ్లలో దోమలు పెరగకుండా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమ లార్వాలపై పలు ప్రాంతాల్లో సర్వే చేయిస్తే బయటపడిందని తెలిపారు. నగరంలో 50 శాతం ఇండల్లో నీటి ట్యాంకులు, కుండీలు, తోట్లలో దోమ లార్వా కనిపిస్తుందని చెప్పారు. జ్వర బాధితుల చికిత్స కోసం ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడిస్తున్నారు. నగరంలో 15 ప్లేట్‌లెట్ సెపరేషన్ మిషన్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ తగ్గిన ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.

నిర్లక్షం వహిస్తే థర్‌వేవ్ వచ్చే చాన్స్ ఉందని, ఈసారి పిల్లలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటుండగా, డెంగీ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. డెంగ్యూ లక్షణాలు ఉండటంతో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే టెస్టులు సక్రమంగా నిర్వహించకుండా నిర్దారణ చేస్తూ ఆసుపత్రిలో చేరేలా భయపడుతూ దోచుకునే పనిలో పడ్డాయి. 

ప్రజలు ప్రభుత్వం ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యాధులు విస్తరించకముందే ఫాగింగ్ చేసి నివారణ చర్యలు చేపట్టాలని వైద్యాధికారులు కోరుతున్నారు. గత నాలుగేళ్లుగా డెంగీ కేసులు పరిశీలిస్తే 2017 సంవత్సరంలో 410 మందికి, 2018లో 263 మందికి సోకగా, 2019లో 1406 మంది, 2020లో 100 లోపు నమోదుకాగా ఈఏడాది బారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ప్రజలు ఉస్మానియా, గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో డెంగు నిర్దారణ కోసం ఎలిజా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గత 25 రోజుల నుంచి సీజనల్ వ్యాధులు పెరగడంతో నగరవాసులు బస్తీదవాఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు పెద్ద ఎత్తున వైద్య చికిత్సల కోసం వస్తునారు. డెంగీ అనుమానిత కేసులు రావడంతో వైద్యాధికారులు టెస్టుల కోసం పరికరాలు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని నగర ప్రజలు కోరుతున్నారు.