గౌతం ఆదానీకి సెబీ గ‌ట్టి షాక్

సుమారు రూ.4,500 కోట్ల మేర‌కు నిధులు స‌మ‌కూర్చుకోవాల‌ని త‌ల‌పోస్తున్న ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీకి సెబీ నుండి మరోసారి గ‌ట్టి షాక్ త‌గిలింది. వంట నూనెల కంపెనీ ఆదానీ విల్‌మార్ లిమిటెడ్ (ఏడ‌బ్ల్యూఎల్‌)ను ఇన్షియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీవో)కు తీసుకెళ్లాల‌ని గౌతం ఆదానీ నిర్ణ‌యించారు. 

ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రాథ‌మిక ప‌త్రాల‌ను సెబీకి ఏడ‌బ్ల్యూఎల్ ఈ నెల మూడో తేదీన స‌మ‌ర్పించింది. కానీ ఈ నెల 13న సెబీ వెబ్‌సైట్ అప్‌డేట్ ప్ర‌కారం ఆదానీ విల్మార్ ఐపీవోను ప్ర‌స్తుతం అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచుతున్న‌ట్లు తెలిపింది. అందుకు ఎటువంటి కార‌ణం తెల‌ప‌లేదు. 

తాజాగా ఫ్రెష్ ఈక్విటీ షేర్లు జారీ చేయ‌డం ద్వారా దాదాపు 600 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు సేక‌రించాల‌ని ఏడ‌బ్ల్యూఎల్ ఐపీవోను ప్ర‌తిపాదించింది. పెట్టుబ‌డులుపెంచ‌డంతోపాటు మాన్యుఫాక్చ‌రింగ్ ఫెసిలిటీస్ వ్రుద్ది చేయ‌డానికి, రుణ వాయిదాల చెల్లింపుల‌కు, ఇత‌ర వ్యూహాత్మ‌క లావాదేవీల‌కు ఏడ‌బ్ల్యూఎల్ ఐపీవో ద్వారా నిధులు సేక‌రించాల‌ని ఆదానీ ల‌క్ష్యం. 

ఇదిలా ఉంటే ఆదానీ ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఆదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో ఎటువంటి సెకండ‌రీ ఆఫ‌రింగ్ లేద‌ని తెలిపింది. ఫార్చ్యూన్ బ్రాండ్ కింద గ‌ల వంట నూనె కంపెనీని విక్ర‌యిస్తున్న‌ది.

ఆదానీ విల్మార్ లిమిటెడ్ (ఏడ‌బ్ల్యూఎల్‌)లో ఆదానీ గ్రూప్‌, విల్మార్ గ్రూప్‌లు చెరిస‌గం వాటా క‌లిగి ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్లలో ఆరు ఆదానీ గ్రూప్ కంపెనీలు లిస్టెడ్ అయ్యాయి. వాటిలో ఆదానీ ఎంట‌ర్ ప్రైజెస్ లిమిడెడ్‌, ఆదానీ ట్రాన్స్‌మిష‌న్‌, ఆదానీ గ్రీన్ ఎన‌ర్జీ, ఆదానీ ప‌వ‌ర్‌, ఆదానీ టోట‌ల్ గ్యాస్‌, ఆదానీ పోర్ట్స్ త‌దిత‌ర కంపెనీలున్నాయి.