ఏపీ ప్రభుత్వం కోర్ట్ ఆదేశాల ధిక్కరణ.. ఎన్‌జిటి స్పష్టం 

రాయలసీమ ఎత్తిపోతల పనుల విషయంలో గతంలో తామిచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ధిక్కరించినట్లు అర్థమవుతోందని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) అభిప్రాయపడింది. తెలంగాణ అందజేసిన ఫొటోలు చూస్తుంటే 80 శాతం పనులు పూర్తయినట్లుందని, అనుమతులు లేకుండా ఇన్ని పనులు జరిగాయా? అని విస్మయం వ్యక్తం చేసింది. 
 
 కెఆర్‌ఎంబి సమర్పించిన నివేదికను బట్టి ఎపి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు స్పష్టంగా తెలుస్తోందని బెంచ్‌ పేర్కొంది. ధిక్కరణ కేసులో గతంలో ఎప్పుడైనా అధికారులను జైలుకు పంపారా? అధికారులను ఎన్‌జిటి నేరుగా జైలుకు పంపవచ్చా? లేదా హైకోర్టు ద్వారా అధికారులను జైలుకు పంపాలా? అనే అంశాలను పరిశీలిస్తామని జస్టిస్‌ రాధాకృష్ణన్‌ చెప్పారు. 
 
ఇప్పటివరకూ ఇటువంటి కేసుల్లో అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురు కాలేదన్న ఎన్జీటి ధర్మాసనం పర్యావరణ శాఖతో కూడా ఎపి ప్రభుత్వం కుమ్మక్కైనట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. మరో వైపు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలమేరకు రాయలసీమ ఎత్తితల పథకం పనులను పరిశీలించిన కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుల బృందం నివిదేక సిద్దం చేసింది. 
 
బోర్డు సభ్యలు రాయపురేతోపాటుగా మౌతంగ్, కేంద్ర జలవనరుల సంఘం డైరెక్టర్ దర్పన్ తల్వార్‌లతో కూడిన బృందం ఈ నెల 11న కర్నూలు జిల్లాలో పర్యటించి పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలపథకం ప్రతిపాదిత పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించింది.
 
అయితే ఈ కేసులో ఎపి స్పందిస్తూ ఈనెల 7నాటికే తాము రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేశామని నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెల్లడించింది. ఏడవ తేది తర్వాత ఎలాంటి పనులు చేపట్టలేదిని స్పష్టం చేసింది. ఈ దశలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం తదుపరి చర్యలపై తీర్పునిస్తామని చెబుతూ కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.