ఆర్టికల్ 370 రద్దు ఫైల్ బహిర్గతంకు సిఐసి తిరస్కరణ 

దేశ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలను ప్రభావితం చేసే సమాచారాన్ని మినహాయించే సమాచార హక్కు చట్టంలోని నిబంధనను పేర్కొంటూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ఫైల్‌ను బహిర్గతం చేయాలన్న అభ్యర్థనను కేంద్ర సమాచార కమిషన్ తిరస్కరించింది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దాఖలు చేసిన అప్పీల్‌లో, ప్రధాన సమాచార కమిషనర్ వై కె సిన్హా  “సిపిఐ [కేంద్ర ప్రజా సమాచార అధికారి] తీసుకున్న నిర్ణయంతో కమీషన్ ఏకీభవించింది” అని స్పష్టం చేశారు.
 

ఆర్టీఐ   చట్టంలోని సెక్షన్ 8 (1) (ఎ) ని ఉదహరించిన “సమాచారం, బహిర్గతం చేయడం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, భద్రత, వ్యూహాత్మక, శాస్త్రీయ లేదా ఆర్థిక ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. విదేశాలతో సంబంధం లేదా నేరాన్ని ప్రేరేపించడానికి దారితీస్తుంది”ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2019 ఆగష్టు 5, 2019 న రాజ్యసభలో, ఒక రోజు తరువాత లోక్ సభలో ఆమోదించారు. ఈ సవరణ అక్టోబర్ 31, 2019 నుండి అమలులోకి వచ్చింది. నవంబర్ 21, 2019 నాటి తన దరఖాస్తులో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి “ఫైల్ నోటింగ్‌లు, క్యాబినెట్ సమావేశానికి హాజరైన మంత్రుల జాబితా, అన్ని ఇతర అనుబంధ పత్రాలతో సహా అన్ని పేపర్‌ల ప్రతులను కోరింది.

 

కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్ తో పాటు ఈ సమస్యపై. ఆగస్టు 5, 2019 నుండి ఈ విషయంలో భారత ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంల మధ్య జరిగిన అన్ని ఉత్తరప్రత్యుత్తరాల ప్రతులను కూడా కోరింది. అయితే ఈ సమాచారం ఇవ్వడం నుండి తమకు మినహాయింపు ఉన్నదని  పేర్కొంటూ, కోరిన సమాచారం ఇవ్వడానికి హోమ్ మంత్రిత్వ శాఖ నిరాకరించింది.

అదే సమయంలో కేబినెట్ సెక్రటేరియట్ దాఖలు చేసిన మరొక ఆర్టీఐ పిటిషన్‌పై కూడా అదే విధానం అనుసరించింది.  ఆర్టీఐ  నుండి క్యాబినెట్ పత్రాలను మినహాయించే సెక్షన్ 8 (1) (ఐ), క్యాబినెట్ నిర్ణయాల గురించి సమాచారాన్ని “నిర్ణయం తీసుకున్న తర్వాత బహిరంగపరచవచ్చు.  విషయం పూర్తయిన తర్వాత, లేదా ముగిసింది” అని చెప్పింది.

ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అమలు చేయడం జరగడంతో ఈ  విషయం ముగిసినందున సమాచారం కోరుతూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సిఐసి ముందు అప్పీల్ చేసింది. విచారణకు ఒక రోజు తర్వాత వచ్చిన తన ఆదేశంలో, సిన్హా ఇలా పేర్కొన్నారు: “దేశ భద్రత లేదా వ్యూహాత్మక ఆసక్తికి సంబంధించిన తీర్పును ప్రభుత్వ విజ్ఞతకే వదిలేయాలి కాబట్టి కమిషన్ ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి ఇష్టపడదు.”