క్విట్ ఇండియా ఉద్యమంలో త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఘన నివాళులు అర్పించారు.
వలస పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించిన మహోన్నతులకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని ట్విట్ చేశారు. మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన ఆనాటి ఉద్యమం యువతరానికి స్ఫూర్తినిచ్చిందని ప్రధాని కొనియాడారు.
మహాత్ముని నేతృత్వంలో 1942 ఆగస్టు 9న మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం ఆ తర్వాత స్వల్పకాలంలోనే బ్రిటీష్ పాలకులు భారత్‌ను విడిచి వెళ్లేందుకు కారణమైందన్నది తెలిసిందే.
ఈ ఏడాది క్విట్ ఇండియా 79వ వార్షికోత్పవాన్ని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతినుద్దేశిస్తూ సందేశమిచ్చారు. సామాజిక రుగ్మతలైన కుల సంకుచితత్వం, మతోన్మాదం, లింగ వివక్షలాంటి వాటిని తొలగించుకునేందుకు పునరంకితమవుదామని నాయుడు పిలుపునిచ్చారు.
మరింత సమ్మిళిత, విశ్వాసపూరిత ఆత్మనిర్భర్‌భారత్ కోసం అడుగులు వేద్దామంటూ ట్విట్ చేశారు.

More Stories
బీహార్ లో ఏకపక్షంగా 200 సీట్ల వైపు ఎన్డీయే ప్రభంజనం
భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి
షాహీన్‌కు పుల్వామా దాడి సూత్రధారి భార్యతో సంబంధాలు!