100 శాతం టీకాలు చేసిన మొదటి నగరం భువనేశ్వర్

ఒడిశా రాజధాని భువనేశ్వర్ సరికొత్త మైలురాయిని సాధించింది. దేశంలో 100 శాతం కరోనా టీకాలు సాధించిన మొదటి నగరంగా నిలిచిందని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) భువనేశ్వర్ జోనల్ డిప్యూటీ కమిషనర్ అన్షుమన్ రథ్ వెల్లడించారు. “మేము నిర్దిష్ట కాలక్రమంలో టీఉంది. ఇంకాలు వే యాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నగరంలో 18 ఏళ్లు పైబడిన తొమ్మిది లక్షల మంది వ్యక్తులు ఉన్నట్లు మా రికార్డులు త్లెయిపాయి. వారిలో 31 వేల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు కూడా  ఉన్నారు” అని తెలిపారు.

వీరిలో  33 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు. 5 లక్షల 17 వేల మంది 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల వారు, 3 లక్షల 25 వేల మంది 45 ఏళ్లు పైబడిన వారున్నట్లు వివరించారు. ఈ వర్గాల వారి టీకాలను నిర్దిష్టంగా జులై 31 లోపు పూర్తి చేయడానికి తాము ఒక బెంచ్‌మార్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే తాము నగరంలో 18 లక్షల 16 వేల మందికి టీకాలు వేశామని,  వివిధ కారణాల వల్ల కొద్దిమందికి మాత్రమే మొదటగా చేయలేకపోయామని కమీషనర్ తెలిపారు. భువనేశ్వర్‌లోను తమ కార్యాలయాలలో పనిచేస్తున్న వలస కార్మికులకు కోవాక్సిన్  మొదటి డోస్ ఇచ్చిన్నట్లు రాత్ పేర్కొన్నారు.

గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయడం గురించి రత్ మాట్లాడుతూ, “గర్భిణీ స్త్రీలు టీకా కేంద్రాలలో మొదటి డోస్ పొందుతున్నారు. వారికోసం 55 టీకా కేంద్రాలను నడుపుతున్నాము. వీటిల్లో 30 ప్రాథమిక ఆరోగ్య,  సమాజ కేంద్రాలు, 15 మొబైల్ కేంద్రాలు, పది కంటే ఎక్కువ డ్రైవ్-ఇన్ టీకాలు ఉన్నాయి” అని ఆయన తెలిపారు.

కరోనా టీకాల  టీకాల లక్ష్యాన్ని సాధించడానికి మునిసిపల్ కార్పొరేషన్ కు సహకరించిన నగర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  అన్ని సూక్ష్మ ప్రణాళికలని కార్పొరేషన్ స్థాయిలోనే రూపొందించడంతో భువనేశ్వర్ 100 శాతం టీకాల లక్ష్యాన్ని చేరుకున్న మొదటి నగరంగా నిలిచిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.