యుపిలో శాంతిభద్రతలను పునరుద్ధరించిన ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంతకు ముందు అధ్వాన్నంగా ఉన్న శాంతిభద్రతలను రాష్ట్రంలో విశేషంగా మెరుగుపరిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. “2019 వరకు ఆరేళ్లపాటు, నేను యూపీలో చాలా సార్లు పర్యటించాను. అందుకే, ముందు యూపీ గురించి నాకు బాగా తెలుసు. పశ్చిమ యూపీలో భయానక వాతావరణం ఉండెడివి.  దీనివల్ల ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లేవారు.  మహిళలు రక్షణలేదని భయానకంగా గడిపేవారు. ల్యాండ్ మాఫియా పేద ప్రజల భూమిని లాక్కోవడం, పగటిపూట కాల్పులు జరిపిన సంఘటనలు, అల్లర్లు ప్రబలంగా  ఉండెడివి” అని పేర్కొన్నారు. 

లక్నోలో ఉత్తర ప్రదేశ్ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ శంకుస్థాపన తర్వాత కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ 2017లో, యూపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేస్తామని,  శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చినదని గుర్తు చేసారు. 

ఈరోజు 2021 లో, యోగి ఆదిత్యనాథ్ ఆయన బృందం యుపిని శాంతిభద్రతల పరంగా రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లారని తానెంతో గర్వంగా చెప్పగలుగుతున్నానని అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వాలు పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. 

“బిజెపి ప్రభుత్వాలు కులం, కుటుంబాలు లేదా వారికి దగ్గరగా ఉన్న వ్యక్తుల కోసం పని చేయవు. బిజెపి ప్రభుత్వాలు అత్యంత పేద వ్యక్తి అభివృద్ధికి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పని చేస్తాయి”అని  తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేసినందుకు షా ఆదిత్యనాథ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

“ఈ రోజు, 44 అభివృద్ధి పథకాలలో, యుపి దేశంలో అగ్రస్థానంలో ఉంది. పథకాలను రూపొందించడం చాలా సులభం, కానీ వాటిని అమలు చేయడం, మధ్యవర్తులను తొలగించడం, లంచం లేకుండా లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా చూడటం చాలా కష్టం” అని ఆయన అన్నారు.చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మతో పాటు ఆదిత్యనాథ్ హాజరయ్యారు.