సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించండి
కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. కరోనా వ్యాక్సినేషన్‌ను సంతృప్తికర స్థాయిలో నిర్వహించడం ద్వారా ఆయా జిల్లాల్లో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని వివరించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది.
పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలివ్వాలని తెలిపింది. జిల్లాల వారీగా సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ల ఉనికిని గుర్తించేందుకు ఇన్సకాగ్ (ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం) ల్యాబ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది.
కొత్తగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో 80 శాతం మంది 45–60 ఏళ్లలోపు వారేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్‌లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. సామూహిక వేడుకలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు హితవు పలికారు.
రాష్ట్రాలకు రూ.1,827 కోట్లు విడుదల
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుర్చడానికి కేంద్ర ప్రభుత్వం కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ (ఈసీఆర్‌పీ–2) పేరిట ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజీ కింద రూ.12,185 కోట్లు కేటాయించింది.
తాజాగా ఇందులో 15 శాతం.. అంటే రూ.1,827.8 కోట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.281.98 కోట్లు, బిహార్‌కు రూ.154 కోట్లు, రాజస్తాన్‌కు రూ.132 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.131 కోట్లు ఇచ్చారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- 8 మంది మృతి
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి