ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మార్చి-మే మధ్య కాలంలో కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారత దేశంలో వృద్ధి అవకాశాలపై అంచనాలను తగ్గించినట్లు తెలిపింది. ఈ ఎదురు దెబ్బ నుంచి చాలా నెమ్మదిగా కోలుకునే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపింది.
కరోనా వైరస్ రెండో ప్రభంజనంలో భారత దేశం తీవ్రంగా ప్రభావితమైంది. ఆరోగ్య సంరక్షణ రంగంపై ఒత్తిడి ఎక్కువైంది. అత్యవసర మందులు, ఆక్సిజన్ వంటివాటిని డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. భారత దేశంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు విస్తరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇక 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అంతర్జాతీయ వృద్ధి రేటు ఆరు శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ తన అంచనాలను కొనసాగించింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన దానికంటే మందకొడిగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

More Stories
అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!
నవంబర్ 1 నుంచి బ్యాంక్, క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో కీలక మార్పులు
డ్రగ్స్‌పై బ్రెజిల్ భారీ ఆపరేషన్.. 64 మంది మృతి