
రూ 1,074 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, శివమొగ్గ జిల్లాలో రూ 560 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు పునాది వేసిన అనంతరం ఆయన తన ఇంటి కార్యాలయం నుండి మాట్లాడారు. “గత రెండేళ్ళలో శివమొగ్గ జిల్లా అభివృద్ధికి గరిష్ట ప్రయత్నాలు చేశానని నేను సంతృప్తి చెందుతున్నాను. ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు దానికి సాక్ష్యం” అని పేర్కొన్నారు.
శివమొగ్గతో సహా ఎనిమిది జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడి, సహాయ, సహాయక చర్యలు చేపట్టమని వారికి ఆదేశించానని తెలిపారు. పలు . సవాళ్లను ఎదుర్కోవడంలో తనకు సహకరించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం తన పదవిలో చివరి రోజు కావచ్చని సూచిస్తూ, జూలై 25 న కేంద్ర నాయకులు తన ఇచ్చే సూచనల ఆధారంగా జూలై 26 నుంచి “తన పనిని” ప్రారంభిస్తామని యడియరప్ప ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఆయన ప్రభుత్వం జూలై 26 న రెండేళ్ల పదవిని పూర్తి చేస్తుంది.
షికారిపురలో పురసభ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన యెడియరప్ప 1983 లో మొదటిసారి షికారిపుర నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. అక్కడ నుండి ఎనిమిది సార్లు విజయం సాధించారు. ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు బి వై రాఘవేంద్ర శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన, పొలాలకు నీటిని అందించే నీటిపారుదల పనులు, శివమొగ్గలోని సరస్సులను నింపడం వంటి అనేక కార్యక్రమాలను ప్రస్తావించిన
సోగనే గ్రామంలో శివమొగ్గ విమానాశ్రయం పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్న ఆయన, రూ 384 కోట్ల వ్యయంతో విమానాశ్రయం ఎయిర్‌బస్ విమానాలను నడపడానికి ఆచరణీయమని, పర్యాటక రంగం, పరిశ్రమలు, ఉపాధి కల్పన పరంగా పొరుగు జిల్లాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం