మాన్సస్ ట్రస్ట్ ఈఓ వెంకటేశ్వరరావు సహకరించడం లేదంటూ ఆ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని పిటిషన్ లో తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఏ బెంచ్ విచారణ జరపాలో సీజే ముందు పెట్టి నిర్ణయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
కాగా, కొద్దిరోజుల క్రితం పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ విజయనగరంలోని మాన్సాస్ కార్యాలయం వద్ద ట్రస్టు కళాశాలల ఉద్యోగులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. జీతాలు నిలిపివేయాలని ఈవో వెంకటేశ్వరరావు బ్యాంకుకు లేఖ రాయడంతోనే వేతనాలు నిలిచిపోయాయని ఉద్యోగులు ఆరోపించారు.
16 నెలలుగా అరకొర జీతాలతోనే పనిచేస్తున్నా..ఈనెల పూర్తిగా నిలిపివేశారని మండిపడ్డారు. అడిగితే తనకేం తెలియదని ఈవో చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల సమస్యలను ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు దృష్టికి ఉద్యోగులు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఈవో తీరుపై గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

More Stories
రూ.1,240 కోట్లతో బళ్లారి- గుంతకల్లు రైల్వే ప్రాజెక్ట్
నీట్ వివాదంతో వైషమ్యాలు రెచ్చగొట్టే కుట్ర
మాజీ నాబార్డ్ ఛైర్మన్ పామిడి కోటయ్య కన్నుమూత