దేశవిచ్ఛిన్నకర మతమార్పిడి ఎజెండాతో జగన్!

ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణిస్తారు. ఏదేమైనా, ఇప్పుడు సాధారణ ఆలయ దాడులు, విధ్వంసాలు, దూకుడుగా మత మార్పిడి ఎజెండా, హింస,  హిందూ అనుకూల పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజును హత్య చేసినట్లు ఆరోపణలతో రాజకీయాలు మునిగిపోయినట్లు తెలుస్తోంది.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ మతం వ్యతిరేకత, కులతత్వం, కక్ష సాధింపు, అవినీతి విధానాలపై ప్రశ్నలు సంధించిన కారణంగా ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు ను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇంటి ఉంది తీసుకెళ్లి, కల్పిత నేరారోపణలతో అరెస్ట్ చేశారు.
అయితే  రఘురామ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు జోక్యంతో ఆయనకు ఊరట పొందగలిగారు.  ఎమర్జెన్సీ విధించినపుడు కూడా ప్రతిపక్ష నాయకులపై ఇందిరా గాంధీ ప్రభుత్వం  ఇలాంటి వేధింపులు జరగలేదు.  సిబిఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో జగన్‌ మొదటి ముద్దాయిగా స్వయంగా  16 నెలలు జైలులో  ఉన్నారు. ఆ కాలంలో ఆయన పట్లనాటి ప్రభుత్వ యంత్రాంగం  అనుచితంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎక్కడా రాలేదు.

ఇదే భారతీయ ప్రజాస్వామ్యమా?

2012 లో అతన్ని అరెస్టు చేసిన సమయంలో, జగన్ దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుడిగా పరిగణించబడ్డాడు,   తన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను పలు కంపెనీలకు లబ్ధి కలిగేలా కుట్రపన్నారని సీబీఐ చార్జిషీటులో పేర్కొన్నది. ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదా?
 బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్‌లలో జగన్‌ విలాసవంతమైన భవంతులు నిర్మించారు. అమరావతిలోనూ అత్యంత ఖరీదైన భవంతిని నిర్మించారు.  2011లో హైదరాబాద్‌లోని జగన్‌ నివాసంలో సీబీఐ దాడులు చేసినప్పుడు సంపన్నమైన బంజారా హిల్స్ లో  ఎకరా విస్తీర్ణంలో 75 గదులున్న ఆ భవనంలో విచారణ చేసేందుకు సీబీఐకి పది గంటల సమయం పట్టింది.
ఈ భవనం విలువ దాదాపు రూ.400 కోట్లు ఉంటుందని అనధికారిక అంచనా వేశారు. ఈ భవనంపై హెలిప్యాడ్‌ నిర్మించే యోచనలో జగన్‌ ఉన్నారంటూ ప్రచారం జరిగింది.  బెంగళూరులోని ఆయనకు చెందిన 31 ఎకరాల భవన సముదాయంలో హెలిప్యాడ్‌ ఉంది.  జగన్‌ అక్రమాస్తుల కేసులు అన్నింటిలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత  విజయసాయి రెడ్డి రెండవ నిందితుడిగా ఉన్నారు.
జగన్ ఒక్క ఉద్యోగం కూడా చేయలేదు. ఎప్పుడూ చెప్పుకోదగిన  వ్యాపారం కూడా చేయలేదు. కాని బిలియన్ల రూపాయల విలువగల ఆస్తులతో ఇప్పుడు బెయిల్ పై ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలోని రాజకీయ నాయకులు అందరిలో బహుశా ఆయనే సంపన్నుడు కావచ్చు.
 తనపై ఉన్న సిబిఐ కేసులలో తనతో పాటు జైలులో ఉన్నవారు, కీలక నిందితులు, కీలక సాక్షులకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి పనితీరు, ఎన్నికల అనంతర హింస సమయంలో కేంద్రం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై కఠినంగా వ్యవహరించి, తగు చర్య తీసుకొనక పోవడంతో తన పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసే ధైర్యం కలిగించిన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడి పైననే ఈ విధంగా వ్యవహరించిన వ్యవహరించిన వారు రేపు తమ అజెండాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తే ప్రధాన మంత్రి, కేంద్ర హోమ్ మంత్రి, సుప్రీం కోర్ట్ లేదా హై కోర్ట్ న్యాయమూర్తులపై కూడా ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చు గదా? అనే అనుమానం ఈ సందర్భంగా కలగడం సహజం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చట్టబద్ధ పాలన అంటూ  లేదని, రాజ్యాంగం పట్ల గౌరవం లేదని చాలామంది ఆరోపిస్తున్నారు. ఎవరైనా జగన్ విధానాలను విమర్శిస్తున్నట్లు కనిపిస్తే వారిని 24 గంటల లోగా ఏదో ఒక కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ఇదొక్క ప్రత్యేకమైన భారత దేశం గదా!
జగన్ కుటుంభం మత మార్పిడి ఎజెండా
కానీ ఈ అవినీతి కథ భారతదేశానికి కొత్త కాదు. భారతదేశంలో చాలా మంది అనారోగ్యం  క్షీణించిన, ప్రమాదకర నేరస్థులు చాల రాష్ట్రాలలో రాజకీయంగా అత్యున్నత స్థానాలలో ఉన్నారు.అయితే అంతుకు భిన్నంగా జగన్, అతని కుటుంభం ప్రమాదకర అజెండాను అనుసరిస్తున్నారు. పాశ్చాత దేశాలకు చెందిన క్రైస్తవ అజెండాను అమలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ (తెలంగాణాలో కూడా) పెద్ద ఎత్తున క్రైష్ఠవ మతంలోకి మతమార్పిడులు జరిపించడమనీ కరిస్తావా మిషనరీ అజెండాను అమలు పరుస్తున్నారు.  భారతదేశంలోని, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని మధ్యయుగ క్రైస్తవ పద్ధతులను అందుకు ఉపయోగిస్తున్నారు.
జగన్, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావమరిది అనిల్ కుమార్ లతో కూడిన అతని కుటుంబం క్రైస్తవ మతోన్మాదులు.  వారు హిందువుల వలె దుస్తులు ధరిస్తారు. భారతదేశాన్ని క్రైస్తవీకరించడానికి బహిరంగంగా ప్రకటించిన ఎజెండాతో ప్రాజెక్ట్ జాషువా కింద ఉన్న పాశ్చాత్య ఏజెన్సీలు తన బావమరిది అనిల్ కుమార్ వంటి వారు నైతికంగా దివాళా తీసిన వారిని సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు.
జగన్ సోదరి షర్మిలా తెలంగాణలో ఒక క్రొత్త రాజకీయ పార్టీని ప్రారంభించింది. ఇది తెలంగాణలో ఒక క్రైస్తవ ఓటింగ్ బ్యాంకు సృష్టించు కొంటున్నది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 20 నుండి 30 శాతం మంది ప్రజలు మతమార్పిడి గురయ్యారు.  క్రైస్తవులను వోట్ బ్యాంకుగా  ఉపయోగించుకుని మరిన్ని మతమార్పిడులకు దారితీసే విధానాలను బలవంతంగా అమలు చేయడమే ఆమె ఎజెండా.

పాశ్చాత్య దేశాలలో, బహుశా మొత్తం ప్రపంచంలో వివేకవంతమైన  క్రైస్తవులు హిందూ మతం ఆలోచనల పట్ల ఎక్కువగా మొగ్గుచూపుతున్నప్పుడు  వీరు మతమార్పిడులపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారు?, మతమార్పిడి అజెండా బహుశా అధికారం, అవినీతిలకు ఒక ముసుగు కాదా? ఆంధ్రాలో జగన్ రాజకీయంగా ఎదగడానికి పాశ్చాత్య క్రైస్తవ మిషనరీల మౌలిక సదుపాయాల నుండి అపారమైన మద్దతు లభిస్తున్నది. ఈ ప్రక్రియలో, ఈ అతని కుటుంబం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రణాళిక చేస్తున్న వెస్ట్రన్ గ్లోబల్ ఎలైట్ ఫోర్స్‌ వ్యూహంలో చిక్కుకొంటున్నది.

క్రైస్తవ మతోన్మాదుల హింసాకాండ 

జగన్,  అతని కుటుంబం, ముఖ్యంగా అతని బావ అనిల్ కుమార్ దేవాలయాల దహనం, అక్రమ చర్చిల నిర్మాణం, మతమార్పిడులు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే వారిని అణచివేయడం కోసం రాష్ట్రంలోని క్రైస్తవ మతోన్మాదులు ధైర్యంగా హింసాకాండకు పాల్పడుతున్నారు.హిందువులను దెబ్బతీసినందుకు ఇటీవల వార్తల్లో నిలిచిన ఆంధ్ర సిఐడి ఇన్‌చార్జి,  ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుమార్ హిందూ అనుకూల ఎంపి రఘురామ్ కృష్ణరాజును హింసించిన బృందానికి నాయకత్వం వహించారు.
స్పష్టంగా అతని బృందంలో ఒకరు ఎంపీ ఛాతీపై కూర్చున్నారు (ఆయనకు ఇటీవల గుండె శస్త్రచికిత్స జరిగింది). అన్‌లాక్ చేసి స్మార్ట్‌ఫోన్‌ను తనకు అప్పగించమని వత్తిడి చేశారు.కొద్ది రోజుల క్రితం ముస్లిం ఓటు బ్యాంకును నిర్మించే ప్రయత్నాలలో కర్ణాటక, కేరళలో హిందువులపై అనేక దారుణాలకు పాల్పడిన ఇస్లామిక్ నియంత టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగాయి.
హిందూ దేవతల పట్ల విద్వేష  ప్రచారం చేసిన కత్తి మహేష్ రోడ్ ప్రమాదానికి గురయితే, అతని వైద్య చికిత్సకోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ 17 లక్షల ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం గమనార్హం. హిందువులను ద్వేషించే వారికి ఈ ప్రభుత్వ మద్దతు పుష్కలంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. హిందూ దేవతలపై విద్వేషం వ్యాప్తి చేస్తున్నందుకు అతనిని హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టవద్దని గతంలో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు, విధ్వంసాలు జరిగినా ఒక్క కేసులో కూడా నిందితులను పట్టుకొని, శిక్షలు విధింపలేదు. పైగా, హిందూ ఎండోమెంట్స్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ దేవాలయాలలోని హిందూయేతరులను ఉద్యోగులుగా నిర్మిస్తున్నారు.

ఆంధ్ర పోలీస్ క్రైస్తవీకరణ
 క్రైస్తవ దండయాత్రలు, మతమార్పిడులకు ముందుగా కీలకమైన అధికార పదవులను ఆక్రమిస్తుంటారు. అడ్డుతగిలినా వారిపై అప్పుడు  విచ్చలవిడిగా హింసను ప్రయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.ఆయన ప్రభుత్వంలో హోమ్ మంత్రి ఎం సుచరిత స్వయం ప్రకటిత క్రైస్తవ మహిళా.  అయితే తప్పుడు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ద్వారా ఆమె ఎస్సి రిజర్వు నియోజకవర్గం నుండి చట్టవిరుద్ధంగా ఎన్నికయ్యారు. హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సిఐడి అధిపతిగా ఎంపీ రఘురామ్ రాజును చిత్రహింసలకు గురిచేశాడు.
పోలీస్ శాఖలో కీలక స్థానాలలో పలువురు క్రైస్తవ అధికారులను నియమిస్తున్నారు. హిందూ ప్రార్ధన స్థలాలపై దాడులు జరిగితే వీరు స్పందించారు. జగన్  అధికారమలోకి వచ్చిన కొత్తలో దాడులకు గురయ్యే హిందూ దేవాలయాలను కాకుండా మైనారిటీ ప్రార్ధన స్థలాలకు మాత్రమే రక్షణ కల్పించామని పోలీస్ లకు అనధికార ఆదేశాలు అందాయి.
 
(ఆర్గనైజర్  కధనం ఆధారంగా)